Saturday, September 19, 2026 10:18 PM
Saturday, September 19, 2026 10:18 PM

మరో ఎమ్మెల్యేకి టీడీపీ అధిష్టానం క్లాస్..?

ఇటీవల కాలంలో టిడిపి ఎమ్మెల్యేలు వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. పదేపదే ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదంలో ఉండటం, స్థానిక నాయకులతో తలెత్తిన విభేదాలు, మీడియా సమావేశంలో అనవసర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో అనవసర పోస్టులతో ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి, విజయవాడ ఎంపీ చిన్ని కేసు వ్యవహారాలపై దృష్టి సారించింది. వాళ్ళిద్దరితో మాట్లాడాలని సీఎం చంద్రబాబు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : బ్రేకింగ్: కెనడా సంచలన నిర్ణయం.. టూరిస్ట్ వీసాలు రద్దు..?

ఇక తాజాగా మరో ఎమ్మెల్యే కూడా వివాదంలో ఉండటంతో అతన్ని కూడా అధిష్టానం పిలిచింది. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టిడిపి అధిష్టానం నుంచి ఫోన్ వెళ్ళింది. ఎమ్మెల్యే పై గత కొంతకాలంగా స్థానిక నేతలు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం దృష్టి పెట్టింది. ఇటీవల కావలిలో జరిగిన పరిణామాలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కాసేపటి క్రితం కావ్య కృష్ణారెడ్డి భేటీ అయ్యారు.

Also Read : సజ్జల భార్గవ్ కు ప్రమోషన్?? సాక్షిలో కీలక బాధ్యతలు..!

ఇటీవల కాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై పల్లా శ్రీనివాసరావు ఆరా తీయగా.. కొందరు నేతలు పై తిరిగి కావ్య కృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల మరణించిన సుబ్బానాయుడుతో తనకి ఎటువంటి విభేదాలు లేవని పల్లా శ్రీనివాసరావుకు క్లారిటీ ఇచ్చారు కావ్య కృష్ణారెడ్డి. నామినేటెడ్ పదవుల విషయంలో సుబ్బానాయుడు చెప్పిన వారికి ఇచ్చానని వివరణ ఇచ్చారు. పార్టీ నాయకులను అవమానించే విధంగా వ్యవహరించవద్దని పల్లా శ్రీనివాసరావు సూచించినట్లు సమాచారం. ఇక ఈ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పల్లా అందించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్