Saturday, September 19, 2026 11:21 PM
Saturday, September 19, 2026 11:21 PM

సజ్జల భార్గవ్ కు ప్రమోషన్?? సాక్షిలో కీలక బాధ్యతలు..!

వైసీపీలో సజ్జల భార్గవ్ రెడ్డి పాత్ర ఏమిటి..? చాన్నాళ్లుగా ఈ ప్రశ్న వినపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ సోషల్ మీడియా విషయంలో సజ్జల భార్గవ్ దూకుడుగా ఉండేవారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ప్రతి ఒక్కరి సోషల్ మీడియా ఖాతాలను ఆయనే చూసేవారు. ఆయన ఆదేశాలు లేకుండా సోషల్ మీడియాలో ఏ పోస్టు వైసీపీ కీలక నేతలు కూడా పెట్టే పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి కనపడకుండా పోయారు. తండ్రి అండదండలతో చెలరేగిపోయిన భార్గవ్ రెడ్డి.. వరుస కేసులు నమోదు కావడంతో సైలెంట్ అయిపోయారు.

Also Read : ఇంకా కుటుంబానికి దూరంగా.. ఎయిర్ ఇండియా ప్రమాద బాధితుడి నిత్య నరకం..!

ఇక అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉందని అందరూ భావించిన సరే.. ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంలో భార్గవ్ సఫలమయ్యారు. అయితే కొన్నాళ్లుగా దూరంగా ఉన్న భార్గవ్ ఇప్పుడు.. ఓ కీలక బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో తమకు ఎలక్ట్రానిక్ మీడియా సహకారం లేదని భావించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. మీడియా బలోపేతంపై దృష్టి సారించారు. దీనితో ఈ విషయంలో సమర్థుడిగా భావిస్తున్న సజ్జల భార్గవ్ కు సాక్షి డిజిటల్ మీడియా హెడ్ గా బాధ్యతలు అప్పగించారు. కేవలం సాక్షి ఛానల్ లో మాత్రమే కాకుండా.. వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలను, టిడిపికి వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థలను ఏకతాటి మీదకు తీసుకువచ్చే దిశగా సజ్జల భార్గవ్ పనిచేసే అవకాశం ఉంది.

Also Read : వాళ్లకు ఫాస్టాగ్ బంద్.. కొత్త రూల్ తెచ్చిన కేంద్రం..!

ఇక భార్గవ్ తో పాటుగా.. వైయస్ జగన్ పెద్ద కుమార్తె వర్షా రెడ్డి కూడా సాక్షిలో కీలక బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం. లండన్ లో ఉన్నత చదువులు చదివిన ఆమె.. త్వరలోనే హైదరాబాదులో అడుగుపెట్టి సాక్షి బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు భార్గవ్ సాక్షిని, వైసిపి అనుకూల మీడియాని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రచించాలని, వాటికి అనుగుణంగా పనిచేయాలని వైయస్ జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఇక భార్గవ్ తో పాటుగా తనతో సన్నిహితంగా ఉండే మరో కీలక వ్యక్తిని కూడా జగన్ సాక్షిలో నియమించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సాక్షి ఛానల్ పదేపదే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న నేపథ్యంలో గాడిలో పెట్టాలని వైసీపీ కార్యకర్తలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలో సజ్జల భార్గవ్ కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించడం ఆసక్తిగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్