Sunday, March 22, 2026 12:33 PM
Sunday, March 22, 2026 12:33 PM

మహిళా క్రికెట్ ను బ్రతికించిన తెలుగు అమ్మాయి.. ఈ విజయం నీదే..!

సాధారణంగా క్రికెట్ అంటే అబ్బాయిలు మాత్రమే ఆడతారు అనే భ్రమ చాలా మందిలో ఉండేది. అబ్బాయిలకే ఆ సామర్ధ్యాలు ఉంటాయనే అపోహ బలంగా ఉండేది. అందుకే భారత్ లాంటి దేశాల్లో కూడా మహిళలు క్రికెట్ ఆడుతుంటే చూడని పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా ఆటగాళ్లను చిన్న చూపు చూసేది అనే విమర్శ వినపడేది. కనీసం ప్రచారం కూడా ఉండేది కాదు. ఆటగాళ్ళు సెంచరీలు చేసినా, వికెట్ తీసినా.. సెలెబ్రేట్ చేసుకోవడానికి కేవలం సహచర ఆటగాళ్లే ఉండే పరిస్థితి.

Also Read : నవంబర్ 15.. ముహుర్తం ఫిక్స్..!

మైదానాలకు అభిమానులు కూడా వెళ్ళే వారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. క్రికెట్ అంటే అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ అదరగొడతారు అని ప్రూవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. భారత్ లాంటి దేశంలో మహిళా క్రికెట్ కు ఆదరణ పెరిగింది. తొలిసారి మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచింది. కానీ ఈ విజయం వెనుక వినపడే పేరు మిథాలి రాజ్. ఈ తెలుగు అమ్మాయి కారణంగానే భారత్ లో మహిళా క్రికెట్ కు ఆదరణ పెరిగింది. ఆమె రెండు సార్లు ప్రపంచ కప్ ఫైనల్ కు తీసుకు వెళ్ళినా.. విజయ లక్ష్మి మాత్రం వరించలేదు.

అంతర్జాతీయ ప్రమాణాలతో తాను రాణించడమే కాకుండా.. క్రమంగా జట్టును ఆ స్థాయికి తీసుకుని వెళ్ళింది. స్మ్రితి మంధన, హార్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, సహా ఎందరో అమ్మాయిలను ప్రోత్సహించింది. సెలెక్షన్ కమిటీ చేయాల్సిన పనులు కూడా తానే చేసి.. జట్టులో స్ఫూర్తి నింపేది. ఎవరు బాగా ఆడతారో తెలుసుకునేందుకు అమ్మాయిలు ఆడే దేశవాళి మ్యాచ్ లకు ఖాళీ సమయాల్లో వెళ్లి చూసి, వారు తన టీంలో కావాలని పట్టుబట్టి తెచ్చుకున్న ఘనత మిథాలి రాజ్ ది. కనీసం మహిళా క్రికెటర్ లకు ఫ్లైట్ టికెట్ లు కూడా బుక్ చేయని పరిస్థితులను చూసిన మిథాలి..

Also Read : చేవెళ్ళ బస్సు ప్రమాదానికి 9 కారణాలు, మరణాలు అందుకే పెరిగాయా..?

నేడు అబ్బాయిలకు ఇచ్చే మ్యాచ్ ఫీజ్, అమ్మాయిలకు ఇచ్చే మ్యాచ్ ఫీజ్ ఒకటే చేసే స్థితికి జట్టును, బోర్డును నడిపించింది. 39 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చే వరకు తీసుకుని వెళ్ళింది. నేడు భారత మహిళా క్రికెట్ కూడా పురుషుల స్థాయిలో వీక్షకులను, అభిమానులను సంపాదించుకుంది అంటే, మైదానాలకు అభిమానులు వెళ్తున్నారు అంటే, మహిళా క్రికెటర్ ల పేర్లు ప్రపంచానికి తెలిసాయి అంటే దీని వెనుక ఆమె కృషి అమోఘం. అందుకే మహిళా క్రికెటర్ లు అందరూ కప్ ను మిథాలికి ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. క్రికెట్ కు సచిన్ దేవుడు అయితే, మిథాలి దేవత అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్