Sunday, March 22, 2026 03:55 PM
Sunday, March 22, 2026 03:55 PM

ఇండియన్ సినిమా రిచ్ కింగ్.. బిలియన్ డాలర్లు దాటిన ఆస్తులు..!

బాలీవుడ్ కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ సంపద, ఆస్తుల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. సినిమాల కంటే వ్యాపారాలు, క్రికెట్ సహా ఇతర వ్యాపకాలతో అతను భారీగా ఆదాయం ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా అతను ఓ రికార్డ్ కూడా క్రియేట్ చేసినట్టు జాతీయ మీడియా తెలిపింది. షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు బిలియనీర్ అయినట్టు తెలిపింది. 33 సంవత్సరాలలో సినీ పరిశ్రమలో అతను ఏకైక బిలియనీర్ అని పేర్కొంది. అతని ఆస్తులు ఇప్పుడు 1.4 బిలియన్ డాలర్లు అంటే 12490 కోట్ల రూపాయలు చేరుకున్నాయి.

Also Read : అమెరికా షట్ డౌన్.. ప్రమాదంలో వారి ఉద్యోగాలు..!

అక్టోబర్ 1న విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో భాగంగా ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం.. భారతదేశంలో అత్యంత ధనవంతుడైన నటుడిగా షారుఖ్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కూడా పలువురిని అధిగమించాడు. షారుఖ్ సంపద పెరుగుదలను ఉటంకిస్తూ, హురూన్ ఇండియా పలు విషయాలు తెలిపింది. షారుఖ్ ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా 59వ స్థానంలో నిలిచాడు. ఈ సంపదతో మొదటిసారి బిలియనీర్ క్లబ్‌ లో చేరాడు.ఆ తర్వాత పలువురు నటులు ఈ జాబితాలో నిలిచారు.

Also Read : ప్రముఖ కంపెనీతో టచ్ లోకి లోకేష్.. గుజరాత్ వర్సెస్ ఏపీ..?

టేలర్ స్విఫ్ట్ 1.3 బిలియన్ డాలర్లు, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ 1.2 బిలియన్ డాలర్లు, జెర్రీ సీన్‌ఫెల్డ్ 1.2 బిలియన్ డాలర్లు, సెలీనా గోమెజ్ 720 మిలియన్ డాలర్లతో షారుఖ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అతని వ్యాపార భాగస్వామి జూహి చావ్లా, ఆమె కుటుంబం 7790 కోట్ల రూపాయల్ నికర విలువతో జాబితాలో తదుపరి స్థానంలో నిలిచారు. హురున్ ప్రకారం 2160 కోట్ల రూపాయల్ సంపదతో హృతిక్ రోషన్ మూడవ స్థానంలో ఉన్నాడు. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వార్షికంగా ఈ లిస్టు ప్రకటించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా హిందీ సినిమాల్లో అగ్రగామిగా ఉన్న షారుఖ్, రెడ్ చిల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేక వ్యాపారాలు చేస్తున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్