Thursday, May 7, 2026 05:32 AM
Thursday, May 7, 2026 05:32 AM

హెచ్ 1 బీలకు మరో షాక్ తప్పదా..?

వలసల విషయంలో అమెరికా సర్కార్ అనుసరిస్తున్న వైఖరి ప్రపంచ దేశాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇటీవల హెచ్ 1 బీ వీసాల ఫీజులను లక్ష డాలర్లకు పెంచడంతో.. భారత్ సహా అనేక దేశాల్లోని నిపుణులు కంగు తిన్నారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్ 1 బీ వర్కర్ వీసా కార్యక్రమంలో నిబంధనలను కఠినతరం చేసేందుకు.. అమెరికా సెనేట్‌ లోని అగ్రశ్రేణి చట్టసభ సభ్యులు ఓ సంచలన బిల్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్ ప్రకారం యజమానులు చట్టంలో ఉన్న లొసుగులను దుర్వినియోగం చేస్తున్నారట.

Also Read : పార్టీ మారారా లేదా.. బీఆర్ఎస్ కొత్త గేమ్ ప్లాన్..!

ఇప్పుడు ఆ నిబంధనలను మార్చేందుకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లు ఎల్-1 వీసా వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. మల్టీ నేషనల్ కంపెనీలు తమ ప్రస్తుత ఉద్యోగులను విదేశీ ఆఫీసుల నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వనుంది ఈ బిల్. అయితే వాళ్ళు వారి పౌరులు మాత్రమే కావడం గమనార్హం. వేతనాలు, నియామక ప్రమాణాలను పెంచడం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను తప్పనిసరి చేయడం, వీసా అర్హతలను తగ్గించడం ద్వారా నియమాలను కఠినతరం చేయడం ఈ బిల్ లక్ష్యం.

Also Read : ప్రముఖ కంపెనీతో టచ్ లోకి లోకేష్.. గుజరాత్ వర్సెస్ ఏపీ..?

ఇక ఈ బిల్ లో భాగంగా స్టెమ్ డిగ్రీలు ఉన్న వారికి కాస్త ఉపశమనం కల్పిస్తుంది. అంటే స్పెషలిస్ట్ రంగంలో.. నిబంధనలను కఠిన తరం చేస్తారు. దీని ప్రకారం వారికి బ్యాచిలర్ డిగ్రీ కావాల్సి ఉంటుంది. వేతన నియమాలను ఉల్లంఘించినట్లు తేలితే ఏ యజమాని అయినా జరిమానాలు లేదా డిబార్‌మెంట్‌ కు గురవుతారు. రిపబ్లికన్ చక్ గ్రాస్లీ మరియు డెమొక్రాట్ డిక్ డర్బిన్ ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. అటు అమెరికా ఏజెన్సీలు హెచ్ 1 బీల నిబంధనల విషయంలో సర్కార్ పై పోరాటం చేసేందుకు కూడా సిద్దమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్