Wednesday, May 6, 2026 08:28 PM
Wednesday, May 6, 2026 08:28 PM

ఎక్కడ దాక్కున్నా వదలను.. జగన్ సంచలన కామెంట్స్

ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తాజాగా పార్టీ విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా డిజిటల్ యాప్ కూడా జగన్ లాంచ్ చేసారు. ఇక పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమించాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. కూటమి సూపర్ 6 మోసాలను నేతలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Also Read : చంద్రబాబు ముందుకు అసెంబ్లీ అటెండెన్స్..? ఎమ్మెల్యేలపై చర్యలు..?

కూటమి మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. రైతుల తరఫున నిలబడి పోరాడాలని నేతలకు జగన్‌ దిశానిర్ధేశం చేసారు. ఇక డిజిటల్ బుక్ ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అక్రమ కేసులు పెట్టిన కూటమి నేతలు దాడులు చేసినా డిజిటల్ బుక్ లో లాంచ్ చేయాలి అని జగన్ కార్యకర్తలకు సూచించారు. వేధింపులు గురి చేసే వారి వివరాలు అప్ లోడ్ చేయాలని నాయకులను ఆదేశించారు.

Also Read : రాజీనామాలు చేసేద్దాం..? జగన్ సంచలన నిర్ణయం..?

ఇక తమ ప్రభుత్వంలో యూరియా కొరత లేదన్నారు. అమరావతికి కోట్లు తెస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు 5వేల కోట్లు ఖర్చు చేయలేరా అని నిలదీశారు. నారాయణ, శ్రీచైతన్య లాంటి సంస్థల కోసం విద్యారంగాన్ని విద్యారంగాన్ని గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఐదేళ్లలో వైసిపి చేసిన అప్పులు ఏడాదిలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిందని, ప్రభుత్వం చేయకూడని పనులు అన్ని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ కూటమి సూపర్ సిక్స్ మోసాలు ప్రజలకు వివరించాలని, సంసప్త సముద్రాల అవతల అధికారులు దాక్కున్న,రిటైర్ అయిన వదిలి పెట్టేది లేదన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్