Tuesday, October 21, 2025 05:03 PM
Tuesday, October 21, 2025 05:03 PM
roots

పెద్దిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్..? మదనపల్లి ఫైల్స్ లో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఘటనలలో అత్యంత సంచలనం సృష్టించిన ఘటన మదనపల్లి సబ్ రిజిస్త్రార్ ఆఫీస్ లో దస్త్రాలను కాల్చి వేయడం. దీనిపై ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మదనపల్లి మాజీ ఆర్డీవో ఎం.సాకప్ప మురళికి జూన్‌ 2న ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ ను సుప్రీం కోర్ట్ రద్దు చేసింది.

Also Read : టీటీడీ కీలక నిర్ణయం.. అన్ని సేవలకు లక్కీ డిప్‌..!

ఈ మేరకు గురువారం జస్టిస్‌ మనోజ్‌మిశ్రా, జస్టిస్‌ జోయ్‌మాల్యా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో మురళిని కీలక నిందితుడుగా గుర్తించారు. 2024 జూలై 21న మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు దగ్ధం అయిన సంగతి తెలిసిందే. 2022 అక్టోబర్‌ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా మురళి పని చేసారు. ఈ కేసులో అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్లను సీజ్‌ చేసిన అధికారులు.. మురళిని నిందితుడిగా గుర్తించారు.

Also Read : అప్పుడు చెంప దెబ్బ.. ఇప్పుడు స్వామి సేవ..!

సుప్రీం కోర్ట్ ఆదేశాలతో కాసేపటి క్రితం మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో మరో మాజీ ఆర్డీవో హరి ప్రసాద్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్ర కూడా గుర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాధవరెడ్డి, రిటైర్డ్‌ పోస్టల్‌ అధికారి రామకృష్ణారెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారు. మదనపల్లె మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ వెంకటాచలపతి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా, శశికాంత్‌ లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో కీలకంగా ఉన్న మరో నిందితుడు పెద్దిరెడ్డి పీఏ తుకారం విదేశాలకు పారిపోయారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

పోల్స్