Wednesday, August 5, 2026 02:27 PM
Wednesday, August 5, 2026 02:27 PM

కేరళలో మరో వైరస్ అలజడి.. లక్షణాలు ఇవే

ప్రపంచాన్ని నిత్యం ఏదోక వైరస్ కలవరపెడుతునే ఉంది. కరోనా వైరస్ తో నాలుగేళ్ల నుంచి ప్రపంచం భయపడుతూనే ఉంది. ఇక కొన్నాళ్ళుగా మంకీ ఫాక్స్ సహా అనేక వైరస్ లు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఏదోక వ్యాధి బయటపడుతూనే ఉంది. విదేశీ ప్రయాణికుల నుంచి కొన్ని వైరస్ లు కేరళలో వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో వైరస్ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనితో కేరళ ఆరోగ్య శాఖ తక్షణ చర్యలు చేపట్టింది.

Also Read : ఆ కలర్ ఐఫోన్ కు ఇండియాలో ఓ రేంజ్ డిమాండ్..!

ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వైరస్ వ్యాప్తిపై ఆందోళన మొదలైంది. దీనిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం కీలక ప్రకటన చేసారు. కేరళలో ఇంకా యాక్టివ్ గా ఉన్న కేసులు ఉన్నాయని తెలిపారు. 2025 లో కేరళలో ఈ అరుదైన, ప్రాణాంతకమైన మెదడు వ్యాధికి సంక్రమణకు సంబంధించి మొత్తం 69 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయని మంత్రి ప్రకటించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులకు సంబంధించి పలు మరణాలు నమోదు అయ్యాయి.

Also Read : కాంతారాకు షాక్.. హైకోర్ట్ నిర్ణయం ఏంటో..?

2024 లో కోజికోడ్, మలప్పురం, కన్నూర్ లోని పలు క్లస్టర్ల నుంచి వచ్చిన రిపోర్ట్ ల ప్రకారం నీటి ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తోంది. 2023 నిపా మహమ్మారి నుండి కేరళ చాలా నేర్చుకుందని, అందుకే ఈ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని ఆరోగ్య శాఖా మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఒకసారి చూస్తే, అకస్మాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం మరియు వాంతులు, మెడ నొప్పులు, గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్