Wednesday, February 4, 2026 09:25 PM
Wednesday, February 4, 2026 09:25 PM

మరోసారి విమర్శలకు ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు మరోసారి తీవ్ర విమర్శలకు తెర లేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అని మాటను ఇప్పుడు ప్రతిపక్షాలు బ్రహ్మాస్త్రంగా వాడుతున్నాయి. నిన్నటి వరకు రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చెప్పిన దానికి.. ఈ రోజు చేస్తున్న దానికి చాలా తేడా ఉంది. అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్న ఏపీ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలంటూ ఏపీ సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్‌లో కోరడం ఇప్పుడు వివాదాలకు కారణవుతోంది.

Also Read :టి20 జట్టులోకి సీనియర్లు..? గిల్ రీ ఎంట్రీ ఖరారు..?

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలనే భావనతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తున్న ఏపీ సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్‌లో డొనేట్ ఫర్ అమరావతి పేరుతో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఓ క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సీఆర్‌డీఏ.. దానిని స్కాన్ చేస్తే రాజధాని నిర్మాణానికి వీలైనంత నగదు అందజేయవచ్చు. విరాళాలు సీఆర్‌డీఏ అధికారిక అకౌంట్‌లో జమ అవుతాయి. డబ్బులు జమ అయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు డిజిటల్ సంతకంతో అభినందన రశీదు కూడా వస్తుంది.

Also Read :దేవర ఫ్యాన్స్ కు షాక్.. వార్ 2 లో ఆ సాంగ్ కష్టమే..?

అయితే ఈ విరాళాల సేకరణపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సెల్ప్ ఫైనాన్సింగ్ అన్నారు.. తర్వాత అప్పులు చేశారు.. ఇప్పుడు చందాలు అడుగుతున్నారా.. అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి కొందరైతే.. 2016 – 19 మధ్య కాలంలో సేకరించిన విరాళాలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. అప్పట్లో ఇటుకకు రూ.10 అని అడిగారు.. మరి ఎన్ని ఇటుకలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలను కేంద్రం హామీగా వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి సేకరించారు కదా.. వాటి లెక్క ఏమైంది.. ఇప్పుడు విరాళాలు, చందాలు అడుగుతున్నారు.. అని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి సీఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదాస్పదమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్