Friday, September 12, 2025 10:55 AM
Friday, September 12, 2025 10:55 AM
roots

మొత్తానికి నిజం ఒప్పుకున్న సాక్షి..!

నిన్నటి వరకు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట. వైసీపీ కరపత్రం సాక్షి నిజస్వరూపం మరోసారి బయటపడింది. లిక్కర్ స్కామ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్య మిత్రుడు వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కపెడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో వైసీపీ నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతోనే వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఆ తర్వాత అరెస్టు భయంతోనే జగన్ కూడా 2 వారాల పాటు తాడేపల్లి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లోనే అరెస్టు నుంచి తప్పించుకోవడం ఎలా అని సమాలోచనలు జరిపినట్లు సమాచారం.

Also Read : కొత్త రూల్.. అమెరికా వీసా కావాలా..? 15 వేల డాలర్లు కట్టు..!

ఏపీలో లిక్కర్ స్కామ్‌లో కింగ్ పిన్ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్‌కు నోటీసులు రెడీ చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఇక ఈ కేసులో జగన్ అరెస్టు ఖాయమని టీడీపీ, బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దీంతో ఈ కేసులో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. మొత్తం రూ.3,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే అసలు నేరమే జరగలేదు కదా.. అనేది వైసీపీ నేతల మాట. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే.. ఇంక అవినీతికి ఆస్కారం ఏముందనేది వైసీపీ నేతల మాట. అటు సాక్షి పత్రిక కూడా ఇదే మాటను వార్త రూపంలో ప్రచురించింది. లేని అవినీతిని చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారనేది సాక్షి ఆరోపణ.

Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అబ్బాయిలకు ఇంత ఉపయోగమా..?

తాజాగా వెంకటేష్ నాయుడు డబ్బు లెక్కపెడుతున్న వీడియో, స్పెషల్ ఫ్లైట్‌లో ప్రయాణం, జగన్‌తో ఫోటోలు బయటకు రావడంతో వైసీపీ నేతలు ఖంగు తిన్నారు. లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయామని భావించిన వైసీపీ నేతలు.. వెంటనే ప్లేటు ఫిరాయించారు. వెంకటేష్ నాయుడు.. చంద్రబాబు, లోకేష్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వైసీపీ నేతలు.. లిక్కర్ స్కామ్‌ మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని వాదిస్తున్నారు. ఇక సాక్షి పత్రిక కూడా లిక్కర్ స్కామ్ మూలం చంద్రబాబు అంటూ పెద్ద వార్త ప్రచురించింది. నిన్నటి వరకు అసలు స్కామ్ లేదన్నారు.. ఇప్పుడు స్కామ్ మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని వార్త రాశారు. అసలు చంద్రబాబు హయాంలో స్కామ్ జరిగితే… ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ఎందుకు కనిపెట్టలేదు.. చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది ఇప్పుడు పెద్ద మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్