Wednesday, February 4, 2026 09:20 PM
Wednesday, February 4, 2026 09:20 PM

అసలు సునామీ అంటే ఏంటీ..? సునామీలకు కారణాలు ఏంటీ..?

రష్యాలో సంభవించిన భారీ భూకంపంతో అమెరికా, న్యూజిలాండ్ దేశాలు కూడా వణికిపోయాయి. జపాన్ కూడా ఈ విషయంలో ఇబ్బంది పడింది. మొత్తం 30 దేశాలపై ఈ ప్రభావం పడినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సునామీ తీవ్రత అంత భారీగా లేకపోయినా, అలలు మాత్రం భయపెట్టాయి. భూకంప తీవ్రత భారీగా ఉండటంతో, సునామీ ముంచెత్తడం ఖాయమని అందరూ భావించారు. ఒక రకంగా భారీ ప్రాణ నష్టం లేకుండానే బయటపడినట్టే. భూకంపం దెబ్బకు సునామీ మరోసారి హాట్ టాపిక్ అయింది.

Also Read : రిలీజ్ కు ముందే వార్ 2 భారీ కలెక్షన్స్

అసలు సునామీ అంటే ఏంటీ అంటూ.. అందరూ సెర్చ్ చేసే పనిలో పడ్డారు. అసలు సునామీ ఎందుకు అంత నష్టం కలిగిస్తుంది అనేది చాలా మందికి అవగాహన ఉండదు. అసలు సునామీలు ఎందుకు వస్తాయో చూద్దాం. సునామీ అనేది జపనీస్ భాషలో ఉపయోగించే పదం. దీనిని ‘హార్బర్ అల’ అని కూడా అంటారు. ఇది సాధారణంగా సముద్రంలో లేదా పెద్ద సరస్సులలో పెద్ద పరిమాణంలో నీరు స్థానభ్రంశం చెందడం వల్ల కలుగుతుంది. సునామీ అలలు.. సాధారణ అలల కంటే కూడా భిన్నంగా ఉంటాయి.

సాధారణంగా సముద్ర అలలు.. ఇవి చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఏర్పడుతూ ఉంటాయి. సునామి మాత్రం.. సముద్రం అడుగున ఏర్పడే కొన్ని సంఘటనలతో సునామీ అలలు విరుచుకుపడుతూ ఉంటాయి. భూకంపాలు, సముద్ర గర్భంలో ఉండే అగ్ని పర్వతాల పేలుళ్లు, వల్ల సునామీలు సంభవించవచ్చు. కొండచరియలు విరిగిపడినా, హిమనీ నదాలు కరిగినా, ఉల్కల ప్రభావంతో నీటి పైనా లేదా దిగువున అవాంతరాలు ఏర్పడతాయి. ఎక్కువగా భూకంపాలు సునామీలకు కారణం అవుతూ ఉంటాయి.

Also Read : లిక్కర్ స్కాం లో సెన్సేషన్..? బిగ్ బాస్ కు నోటీసులు

భూకంపాలతో సముద్ర గర్భంలో చోటు చేసుకున్న మార్పులతో సముద్రం సాధారణంగా కంటే మరింత వేగంగా ముందుకు వస్తుంది. ఆ సమయంలో అలలు ప్రశాంతంగా కనపడినా.. పల్లపు ప్రాంతాలు అంటే తీర ప్రాంతాల్లోకి వచ్చే సమయానికి వేగంగా వస్తాయి. సాధారణ అలలు 5 నుంచి 8 అడుగుల వరకు ఉంటే సునామీ అలలు కొన్ని 8 మీటర్ల వరకు కూడా ఏర్పడతాయి. సునామీ ప్రభావం గంటల తరబడి ఉంటుంది. ముందు వచ్చే అలల కంటే తర్వాత వచ్చే అలల తీవ్రత ఎక్కువ. అందుకే సునామీ వచ్చిన తర్వాత గంటల పాటు తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఇక క్రీస్తుపూర్వం 479లో మొదటిసారిగా సునామీ నమోదైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్