Wednesday, May 6, 2026 08:58 PM
Wednesday, May 6, 2026 08:58 PM

ట్రంప్ సంచలన ప్రకటన.. పాకిస్తాన్ తో కీలక ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ ను మిత్రదేశంగా చెప్తూనే పాకిస్తాన్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రష్యా వద్ద ఆయిల్ నిల్వలను భారత్ కొంటుంది అనే కోపాన్ని సుంకాల రూపంలో ట్రంప్ ప్రదర్శించిన మరుసటి రోజే తన వైఖరి బయటపెట్టారు. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 25 శాతం సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ సర్కార్ పాకిస్తాన్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Also Read  : అమెరికా, రష్యాలను వణికించిన భూకంపం.. రష్యాలో సునామీ భీభత్సం..!

పాకిస్తాన్ లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడంలో ఆ దేశంతో కలిసి పని చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే పాకిస్తాన్ నుంచి భారత్ కు ఆయిల్ నిల్వలు వెళ్తాయని అన్నారు. కొన్ని సుంకాలు 50 శాతం వరకు ఉంటాయని హెచ్చరించారు ట్రంప్. తమ ప్రభుత్వం.. భారత్ తో చర్చలు జరుపుతుందని, వారం చివరి నాటికి పరిస్థితిలో మరింత స్పష్టత వస్తుంది అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై దాదాపు 39 శాతం, కూరగాయల నుంచి తయారు చేసే నూనెలపై 45 శాతానికి, ఆపిల్, మొక్కజొన్నపై దాదాపు 50 శాతానికి పైగా ధరలు పెరిగాయి.

Also Read  : లిక్కర్ స్కాం లో సెన్సేషన్..? బిగ్ బాస్ కు నోటీసులు

రష్యాతో భారత్ ఏం చేసినా తనకు అనవసరం అన్నారు ట్రంప్. ఆ దేశంతో వ్యాపారం చేయాలని భారత్ అనుకుంటే.. తమ వైఖరి ఇలాగే ఉంటుందని స్పష్టం చేసారు. కాగా రష్యా నుంచి భారత్ దాదాపుగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. క్షిపణి రక్షణ వ్యవస్థలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తూ వస్తోంది. అత్యాధునిక ఆయుధాలను తయారు చేయడంలో రష్యా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక ఇరాన్ నుంచి కూడా రష్యా ఆయిల్ నిల్వలు కొనడంతో.. ఇరాన్ కు భారత్ పరోక్షంగా సహకరిస్తుందనే కోపం కూడా ట్రంప్ లో ఉండవచ్చు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్