Saturday, September 19, 2026 11:16 AM
Saturday, September 19, 2026 11:16 AM

తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ల సందడి..!

తెలుగు రాష్ట్రాల నాయకులకు, గవర్నర్ పదవికి ఏదో దగ్గరి అనుబంధం ఉంది. టీడీపీలో ఉండి, ప్రభుత్వంలో పదవులు లేని పలువురు నాయకులు.. గవర్నర్ పదవుల కోసం ఎదురు చూడటం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణాలో ఒకప్పుడు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన మోత్కుపల్లి నరిసింహులు బీహార్ గవర్నర్ పదవి కోసం ఎంతో ఎదురు చూసారనే వార్తలు వచ్చాయి. అసలు ఆయన టీడీపీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం అదే అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. ఆ తర్వాత పలుమార్లు చంద్రబాబుపై ఆయన విమర్శలు చేసారు.

Also Read : సైలెంట్ మోడ్‌లో వైసీపీ అధినేత..!

క్రమంగా రాజకీయాల నుంచి ఆయన కనుమరుగు అయ్యారు. ఆ తర్వాత విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్ గా వెళ్ళారు. ఆ తర్వాత కొద్ది కాలానికే.. బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ గవర్నర్ గా హర్యానాలో అడుగు పెట్టారు. ఆయన కూడా అక్కడ సమర్ధవంతంగా తన పదవి నిర్వహించారు. ఇటీవలి కాలంలో టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు పేర్లు కూడా గవర్నర్ పదవులకు వినిపించాయి. ఇక బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా ఉన్నారు.

Also Read : భారత్ కు మరో స్టీవ్ బక్నర్ తయారయ్యాడు..!

ప్రస్తుతం జరిగిన మార్పుల్లో హర్యానా గవర్నర్ గా మరొకరిని నియమించారు రాష్ట్రపతి. దీనితో దత్తాత్రేయ పదవీ కాలం ముగిసింది. కంభంపాటి హరిబాబు ప్రస్తుతం ఓడిస్సా రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. ప్రస్తుతం అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. ఈ విషయంలో ఎటువంటి ప్రచారం లేకుండానే కేంద్రం అడుగులు వేసింది. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం అశోక్ గజపతి సొంతం. గత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కుమార్తె అదితి గజపతి రాజు 2019, 2024 ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేసారు. తొలిసారి 78లో అశోక్ గజపతి రాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 లో ఆయన ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్