Wednesday, August 5, 2026 07:02 AM
Wednesday, August 5, 2026 07:02 AM

భారత్ కు మరో స్టీవ్ బక్నర్ తయారయ్యాడు..!

టెస్ట్ క్రికెట్ లో అంపైరింగ్ నిర్ణయాలపై భారత అభిమానులు ఎన్నో ఏళ్ళుగా అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 2007 – 2008 ఆస్ట్రేలియా సీరీస్ సమయంలో స్టీవ్ బక్నర్ అనే కరేబియన్ దిగ్గజ అంపైర్.. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పింది చేయడం చూసి క్రీడా ప్రపంచం నివ్వెర పోయింది. అవుట్ కాకపోయినా సరే అవుట్ అంటూ పాంటింగ్ వేలు లేపిన వెంటనే బక్నర్ లేపడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత అతనిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంపైరింగ్ నుంచి తప్పించింది.

Also Read : స్విచ్ లు మాన్యువల్ గా ఆపలేం.. అనలిస్ట్ సంచలన కామెంట్స్

ఇప్పుడు అలాంటి అంపైర్ ఇంగ్లాండ్ సీరీస్ లో భారత్ కు ఎదురయ్యాడు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజున అంపైర్ పాల్ రిఫరల్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా వ్యవహరించాడు. సిరాజ్ బౌలింగ్ లో క్లియర్ గా రూట్ ఎల్బీడబ్ల్యూ అయినా సరే అంపైర్ మాత్రం నాట్ అవుట్ ఇచ్చాడు. ఇక లెగ్ స్టంప్ ను గిరాటేసే బంతి అయినా సరే అంపైర్స్ కాల్ ఇవ్వడం చూసి భారత అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే సుందర్ బౌలింగ్ లో జో రూట్ బౌల్డ్ అయ్యాడు.

Also Read : మీ చేతి గోర్లు చెప్పే ఆరోగ్య రహస్యాలు

అంతర్జాతీయ క్రికెట్ లో పాల్ రిఫరల్ కు మంచి పేరు ఉంది. అలాంటి అంపైర్ భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యపరిచింది. ఇక 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ బరిలోకి దిగగా.. అంపైర్ గిల్ ను అవుట్ గా ప్రకటించడం కూడా వివాదాస్పదం అయింది. బ్రైడాన్ కార్స్ వేసిన ఫుల్-లెంగ్త్ బంతిని గిల్ మిస్ చేశాడు, అది నేరుగా కీపర్ వద్దకు వెళ్ళింది. ఇంగ్లాండ్ అప్పీల్ చేయగా.. వెంటనే అంపైర్ అవుట్ ఇచ్చేసాడు. ఆ తర్వాత గిల్ రివ్యూకి వెళ్ళగా అది నాట్ అవుట్ గా తేలింది. బంగ్లాదేశ్ అంపైర్ సైకత్ అలీ కూడా వివాదాస్పద నిర్ణయాలతో హాట్ టాపిక్ అయ్యాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్