Friday, June 26, 2026 04:27 AM
Friday, June 26, 2026 04:27 AM

కవిత ఒంటరి అయిపోయారా..? గులాబీ మద్దతు ఎక్కడ..?

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి వర్సెస్ కల్వకుంట్ల కవితగా వాతావరణం కనబడుతోంది. నెలరోజుల క్రితం కవిత చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆమె విషయంలో భారత రాష్ట్ర సమితి నేతలు కూడా కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ పై ప్రేమతో తన సోదరుడిపై ఆగ్రహంతో కవిత కాస్త సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ తర్వాత ఆమె సొంత పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాతావరణం చల్లబడేలా కవిత వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ తన కుమార్తె కవితతో జరిపిన చర్చలు సఫలం కావడంతో కవిత స్వరం మారిందని చాలామంది భావించారు.

Also Read : రష్యా – ఉక్రెయిన్ వార్.. ట్రంప్ సంచలన నిర్ణయం

అది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణలో ఓ వ్యవహారం వివాదాస్పదమైంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన యూట్యూబ్ ఛానల్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవితను లక్ష్యంగా చేసుకుని మంచం పొత్తు అంటూ ఆయన ఓ మాట మాట్లాడారు. దీనితో తెలంగాణ జాగృతి నేతలు ఆయనపై రివేంజ్ తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఆయన కార్యాలయం పై దాడికి దిగారు. ఈ సందర్భంగా నవీన్ గన్మెన్ ఆరుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత కవిత మీడియా ముందుకు వచ్చి నవీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : సైలెంట్ మోడ్‌లో వైసీపీ అధినేత..!

అయితే ఈ విషయంలో తెలంగాణ జాగృతి మినహా భారత రాష్ట్ర సమితి నేతలు మాత్రం కవిత కోసం ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో కేటీఆర్ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కెసిఆర్ కూడా దీనిపై స్పందించినట్లు ఎక్కడ వార్తలు రాలేదు. గులాబీ పార్టీ అగ్ర నాయకులు హరీష్ రావు గాని ఇతర నాయకులు గానీ ఎవరు మీడియా ముందుకు వచ్చి కవితకు అండగా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. దీనితో కవిత ఈ విషయంలో ఒంటరి అయిపోయారని.. భవిష్యత్తులో గులాబీ పార్టీ ఆమెతో కలిసి పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత వ్యక్తిత్వాన్ని అవమానపరిచే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడినా సరే ఈ విషయంలో.. గులాబీ పార్టీ నుంచి మద్దతు రాకపోవడం ఆశ్చర్యపరిచింది. అటు సోషల్ మీడియాలో కూడా గులాబీ పార్టీ కార్యకర్తలు ఆమెకి మద్దతుగా మాట్లాడలేదు. కేటీఆర్ ను లేదంటే కెసిఆర్ ను ఏదైనా అంటే విరుచుకుపడే ఆ పార్టీ కార్యకర్తలు కవిత విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక...

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ...

లోకేష్ సంచలన ప్రకటన.....

అరుదైన వ్యాధులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న...

సీఐ నాగరాజు రిమాండ్...

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె...

పోల్స్