Friday, June 26, 2026 05:55 AM
Friday, June 26, 2026 05:55 AM

ఈరోజు (13-07-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం.. ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం…

మేషం 13-07-2025

దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతగా కలిసిరావు.

—————————————

వృషభం 13-07-2025

స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

—————————————

మిధునం 13-07-2025

సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితులు సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

—————————————

కర్కాటకం 13-07-2025

వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు.

—————————————

సింహం 13-07-2025

తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది.

—————————————

కన్య 13-07-2025

నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

—————————————

తుల 13-07-2025

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

—————————————

వృశ్చికం 13-07-2025

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.

—————————————

ధనస్సు 13-07-2025

వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

—————————————

మకరం 13-07-2025

సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

—————————————

కుంభం 13-07-2025

కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభాలుంటాయి. స్ధిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

—————————————

మీనం 13-07-2025

కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తగినంత ఆదాయం లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక...

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ...

లోకేష్ సంచలన ప్రకటన.....

అరుదైన వ్యాధులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న...

సీఐ నాగరాజు రిమాండ్...

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె...

పోల్స్