Wednesday, February 4, 2026 07:52 PM
Wednesday, February 4, 2026 07:52 PM

బాబోయ్.. నాకేం సంబంధం లేదు..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 2023 డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. అప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఫోన్ ట్యాపింగ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో ఏడాది కాలంగా అమెరికాలో ఉంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావును ఇప్పటికే సిట్ అధికారులు మూడుసార్లు విచారించారు. ఇదే కేసులో త్వరలో ఓ పెద్ద తలకాయను కూడా అరెస్టు చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఇప్పుడు ఇదే వ్యవహారం ఏపీ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలువురు ఏపీకి సంబంధించిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేసి.. వాళ్లు మాట్లాడుకునే మాటలను నేరుగా వైఎస్ జగన్‌కు వినిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జగన్ సోదరి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశారనే మాట ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

Also Read : పాకిస్తాన్ కు బాగా తెలుసు.. ట్రంప్ సంచలన కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే మాట ముమ్మాటికి వాస్తవమని వైఎస్ షర్మిల స్వయంగా వెల్లడించారు. తనను రాజకీయంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే తన ఫోన్ ట్యాపింగ్, తనపై నిఘా పెట్టారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నారని.. అసలు వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధాలు కూడా చిన్నబోయిందన్నారు షర్మిల. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్, జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా తనతోనే చెప్పారని షర్మిల వెల్లడించారు. ఈ విషయంపై బైబిల్ పైన, తన పిల్లల పైన కూడా ఒట్టేసి చెప్తా అని కూడా అన్నారు. తన ఫోన్ సంభాషణ కూడా వినిపించారన్నారు. అదే సమయంలో ఈ విషయం వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా లేదా అనేది కూడా అనుమానమే అని షర్మిల వ్యాఖ్యానించారు.

Also Read : మాకేం సంబంధం లేదు.. మా జోలికి రావొద్దు..!

షర్మిల భయపడినట్లే ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని… అప్పుడు జగన్‌కు, షర్మిలకు సంబంధాలు ఇలా లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌ చేసి కేసీఆర్‌ ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది అంటూ ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందా? లేదా? అనే విషయం కూడా తనకు తెలియదన్నారు. టీడీపీకి సంబంధించిన ఎల్లో టీవీల్లో, పత్రికల్లో తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నా అంటూ వైవీ సుబ్బారెడ్డి పోస్ట్ పెట్టారు.

Also Read : అణు యుద్దమేనా..? వెనక్కు తగ్గని ఇరాన్

వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి వైసీపీ ఎంపీ చెబుతున్నట్లు ఎల్లో టీవీల్లో, పత్రికల్లో ముందు రాలేదు. వైవీ సుబ్బారెడ్డి తోడల్లుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిల స్వయంగా వెల్లడించారు. పైగా దీనిపై ఎక్కడికైనా సరే వస్తా అని సవాల్ కూడా చేశారు. అంటే.. సొంత వదిన కుమార్తె చెప్పిన మాట కూడా అబద్ధమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇక్కడే అసలు విషయం తెలియాల్సి ఉంది. అదేమిటంటే.. దాదాపు 5 నెలలుగా మీడియాకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు సడన్‌గా బయటకు వచ్చారు. దీని వెనుక జగన్ ఉన్నాడనే మాట వినిపిస్తోంది. సొంత చెల్లెలు చెప్పింది అంటే నిజమే కదా అని జనాలంతా నమ్ముతున్నారు. ఇక సొంత బాబాయ్ వివేకా హత్య కేసు గురించే జగన్ చుట్టూ అనుమానాలున్నాయి. ఇదే సమయంలో చెల్లెలు, బావా మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారా అనే మాటపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా సొంత బాబాయి ఈ విషయం చెప్పారని షర్మిల చెప్పడం.. ఈ వివాదానికి మరింత బలం చేకూరుస్తుంది. అందుకే ఆఘమేఘాల మీద వైవీ సుబ్బారెడ్డితో సోషల్ మీడియాలో నాకం సంబంధం లేదు బాబోయ్ అని బాబాయ్‌తో జగన్ చెప్పించారనేది క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్