Saturday, September 19, 2026 07:12 PM
Saturday, September 19, 2026 07:12 PM

బైబిల్ మీద ప్రమాణం.. ఫోన్ టాపింగ్ ఆడియో విన్నా: వైఎస్ షర్మిల

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేసారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన వాయిస్ ఆడియో తాను విన్నాను అంటూ బైబిల్ మీద ప్రమాణం చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు వైఎస్ షర్మిల. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని పేర్కొన్నారు షర్మిల. అనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా అని వ్యాఖ్యానించారు.

Also Read : తల్లికి వందనం.. కూటమికి కాదు.. టీడీపీకి బూస్ట్ ఇచ్చిందా..?

బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం అంటూ స్పష్టం చేసారు. సిఎంలు రేవంత్, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. అనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని.. తన ఉనికి లేకుండా చేయాలని ఇద్దరూ ప్రయత్నం చేశారన్నారు షర్మిల. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అని షర్మిల వ్యాఖ్యలు చేసారు.

Also Read : మెగా ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ.. ఆ సినిమా సంగతేంటి..?

వైఎస్ జగన్, కేసీఆర్ ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్ళన్నారు. వీళ్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అన్నారు షర్మిల. నా ఫోన్ ట్యాప్ అయినట్లు నాకు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారని.. వైవీ సుబ్బారెడ్డి ఆనాడే నిర్ధారించారు గుర్తు చేసుకున్నారు షర్మిల. అప్పుడు వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారన్నారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారని.. ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారని బాంబు పేల్చారు షర్మిల.

Also Read : మాకేం సంబంధం లేదు.. మా జోలికి రావొద్దు..!

ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా..అంటే అనుమానమేనన్నారు. జగన్ తన సొంత మేనల్లుడు, మేన కోడలు అస్థి కాజేసే అంశంలో సుబ్బారెడ్డి తో అబద్ధాలు చెప్పించాడన్నారు. ఇలాంటి పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు అనుకోనని వ్యాఖ్యలు చేసారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తాను, ఏ విచారణను అయినా ఎదుర్కొంటాను అని స్పష్టం చేసారు. బైబిల్ మీద ప్రమాణం చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను చెప్పగలనన్నారు. కేసీఆర్, జగన్ చేసిన అరాచకాల ముందు ఫోన్ ట్యాపింగ్ చిన్న వ్యవహారమన్నారు షర్మిల. ఆనాడు పరిస్థితుల కారణంగా తాను మాట్లాడలేకపోయాను అని.. ఇప్పుడు పరిస్థితి వేరు అన్నారు షర్మిల.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్