Saturday, September 19, 2026 07:14 PM
Saturday, September 19, 2026 07:14 PM

కృష్ణంరాజు.. దీనవ్వ తగ్గేదెలా..!

ఇప్పటికీ అదే తీరు.. ఇప్పటికీ అదే తలపొగరు.. తప్పు చేసినా కూడా.. అది తప్పు కాదు అనే బుకాయింపు.. ఓ వైపు సహచరుడు అరెస్టు అయినా సరే.. ఏ మాత్రం భయం లేదు.. పైగా నేను కరెక్ట్.. నేను చెప్పింది రైట్ అని వాదిస్తున్నారు. ఇందుకోసం ఏవో పాత న్యూస్ క్లిప్లింగ్‌లను ఉదాహరిస్తున్నారు. అమరావతి ప్రాంతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎనలిస్టు ముసుగు వేసుకున్న కృష్ణంరాజు.. అరెస్టు భయంతో విజయవాడ నుంచి పారిపోయారు. అయినా సరే.. తాను మాత్రం తప్పు మాట్లాడలేదని.. అందరు అంటున్నదే అన్నాను అంటూ మరో వీడియో రిలీజ్ చేశారు కృష్ణంరాజు.

Also Read : బ్రేకింగ్: వేశ్య కామెంట్స్ పై జాతీయ మహిళా కమీషన్ సీరియస్.. డీజీపీకి లేఖ

ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనే పదవిని అడ్డుపెట్టుకున్న కృష్ణంరాజు అమరావతిని దేవతల రాజధానిగా చంద్రబాబు అంటున్నారు.. కానీ అది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారింది అనేది వాస్తవం అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా సమర్థించారు. నేను కూడా ఈ వార్త చూశాను అని అన్నారు తప్ప.. తప్పు అలా అనొద్దంటూ ఖండించలేదు. పైగా డిబేట్‌ను కొనసాగించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.

Also Read : సజ్జల అరెస్ట్ ఖాయం.. లోకేష్ ట్వీట్ ఇచ్చిన సిగ్నల్..?

దీనిపై అమరావతి ప్రాంత మహిళలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మాట మార్చిన కృష్ణంరాజు.. తాను అమరావతి మహిళల గురించి అలా అనలేదని.. అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని అన్నట్లుగా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. పైగా ఇది తన సొంత వ్యాఖ్యలు కాదని.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. అదే సమయంలో ఈ విషయంపై ప్రభుత్వ అధికారులను అడిగినా సరే.. అక్కడ ఎన్ని కుటుంబాలు ఈ వృత్తిలో ఉన్నాయో చెప్తాయని కూడా అన్నారు. అమరావతిలో 150 స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాను అమరావతికి తాను వ్యతిరేకం కాదని కూడా కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు.

Also Read : జనంలోకి టీడీపీ.. టార్గెట్ ఫిక్స్..!

అమరావతి ప్రాంతంపైన, మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యానించిన కృష్ణంరాజుపైన, డిబేట్ కొనసాగించిన కొమ్మినేని శ్రీనివాసరావుపైన ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులకు మహిళలు ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన అరెస్టు ఖాయమనే భయంతో విజయవాడలోని ఇంటికి తాళం వేసిన కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో అజ్ఞాతం నుంచే మరో వీడియో రిలీజ్ చేశారు కృష్ణంరాజు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్