Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

జగన్ పాపాలు.. మన ప్రాజెక్టులు సెఫేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్టులు సురక్షితమేనా…? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. నిజమే… కృష్ణా, గోదావరి నదులపై ఇప్పటికే మెగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రధానంగా ఏపీ పరిధిలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, గుండ్లకమ్మ, సోమశిల, ధవళేశ్వరం, గొట్టా బ్యారేజ్, తోటపల్లి రిజర్వాయర్‌లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సాధారణంగా ప్రతి ఏడాది వేసవికాలంలో తప్పని సరిగా మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. రిజర్వాయర్లలో నీటి నిల్వ తక్కువగా ఉన్న సమయంలోనే ప్రాజెక్టు గేట్లకు రంగులు వేయడం, చైన్‌లకు గ్రీస్ రాయడం, మోటర్లను చెక్ చేయడం.. అలాగే ప్రాజెక్టు దిగువన సిమెంట్ బేసిన్‌కు ఏర్పడిన పగుళ్లకు మళ్లీ సిమెంట్ పూతలు పూయడం వంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. వీటి వల్ల ప్రాజెక్టులో నీరు చేరిన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తవు కూడా.

Also Read : బ్రేకింగ్: గోరంట్ల వ్యవహారంలో పోలీసులకు బిగ్ షాక్

అయితే ఐదేళ్ల వైసీపీ పాలనలో జలవనరుల శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్న జగన్… అన్నం పెట్టే అన్నదాత నోట్లో మట్టి కొట్టాడనేది అక్షర సత్యం. వ్యవసాయానికి కీలకమైన ప్రాజెక్టులను కనీసం పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు అన్ని ప్రాజెక్టులపై నీలినీడలు అలుముకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు దిగువ భాగంలో ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. నీరు జారి పడే బకెట్ స్థానంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇదే పరిస్థితి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా. ఇందుకు ప్రధాన కారణం జగన్ ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేటు కొట్టుకుపోయింది. ఇందుకు ప్రధాన కారణం జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యలనేది బహిరంగ రహస్యం. ప్రాజెక్టులో నీటిని సామర్థ్యానికి మించి నిల్వ చేయడం వల్ల కరకట్ట పైన ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోవాలనే ప్లాన్ చేశారు. అయితే తాకిడి ఎక్కువగా ఉండటంతో… గేటు కొట్టుకుపోయింది. దీంతో నాటి నుంచి పడవ అడ్డుపెట్టి సరిపెట్టారు అధికారులు.

Also Read : తిరుమల ఘటనపై బీఆర్ నాయుడు సంచలనం

పులిచింతల ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటు కూడా నాలుగేళ్ల క్రితం వరద నీటిలో పోయింది. సాగర్ ప్రాజెక్టు మొదటి గేటు రెండేళ్ల క్రితం పూర్తిగా తెరుచుకోలేదు. ఆ సమయంలో అధికారులు చాలా భయపడ్డారు కూడా. గతేడాది గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధవళేశ్వరం ప్రాజెక్టు మొదటి గేటు వద్ద బోటు ఇరుక్కుపోయింది. దానిని తొలగించలేదు. వరద తాకిడి ఎక్కువగా వస్తే… బోటు వల్ల గేటుకు దెబ్బ తగులుతుందని అధికారులు భయపడ్డారు. తుంగభద్ర రిజర్వాయర్ 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో… గేటు కొట్టుకుపోయింది. దీని వల్ల రైతులకు అందాల్సిన లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలేశారు. ఐదేళ్ల పాటు జగన్ సర్కార్ జలవనరుల శాఖను నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. అత్యవసరంగా వాటికి మరమ్మతులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ చేసిన అప్పుల భారం మోస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఇది అదనపు భారమంటున్నారు ఆర్థిక నిపుణులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్