ఒక టాపిక్ డైవర్ట్ చేయాలంటే.. అది వైసీపీ వల్లే సాధ్యం. వైసీపీ నేతలు ఆడినట్లు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు ఆడలేరు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు. రెండు రోజుల క్రితం వరకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని హత్య అంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత వక్ఫ్ బిల్లు గురించి మైనారిటీలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హిందూ ధర్మం అంటూ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి వైసీపీ నేతలు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలను హత్య చేశారంటూ వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెన్నిలింగం పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
Also Read : బ్రేకింగ్: గోరంట్ల వ్యవహారంలో పోలీసులకు బిగ్ షాక్
తానా అంటే తందానా అన్నట్లుగా కొందరు వైసీపీ నేతలు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేసి.. ఒకవర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే సాక్ష్యాలు అందివ్వాలని బెన్నిలింగంకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో.. అసలు నిజం బయటకు వచ్చింది. నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు అంటూ తోక ముడిచారు. ఇక వక్ఫ్ బిల్లు విషయంలో కూడా మైనారిటీలను రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం వల్ల మైనారిటీల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని.. మైనారిటీలకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ప్రచారం చేశారు. అయితే రాజ్యసభలో వైసీపీ సభ్యులు వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన విషయం బయటకు రావడంతో మళ్లీ సేమ్ సీన్. అలాగే గతంలో సీఏఏ బిల్లు, ఆర్టికల్ 360 రద్దు బిల్లుకు వైసీపీ అన్ కండీషనల్‌గా మద్దతు ఇచ్చిన విషయం కూడా బయటకు రావడంతో.. ఇదేదో తలనొప్పి యవ్వారంగా మారిందని వైసీపీ నేతలే సైలెంట్ అయ్యారు.
Also Read: మంత్రుల ఓఎస్డీల పై చంద్రబాబు గురి
ఇప్పుడు తాజాగా హిందువులను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్ని బొక్క బోర్లా పడ్డారు వైసీపీ నేతలు. కలియుగ ప్రత్యక్ష దైవ్యం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రంలో అపచారం జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. ఎస్వీ గోశాలలో 3 నెలల్లో వందకు పైగా ఆవులు మృతి చెందాయని.. వాటికి కనీస సంరక్షణ లేదని కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి ఇవే రుజువులు అంటూ కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి.. ఎస్వీ గోశాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కనీస చర్యలు కూడా లేవని ఆరోపించారు. అయితే భూమనకు టీటీడీ అధికారులు ఘాటుగా బదులిచ్చారు. ఎస్వీ గోశాల పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. గోశాలలో ఆవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు ఎక్కడివో అని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా.
Also Read : బీజేపీతో డీల్ సెట్ చేసుకున్న సాయిరెడ్డి
భూమన వ్యాఖ్యలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తనదైన శైలిలో జవాబిచ్చారు. అసలు వైఎస్, భూమన కుటుంబాలు హైందవ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయా అని నిలదీశారు. ఒంటిమిట్ట రాములోరి కల్యాణం విషయం డైవర్ట్ చేయడానికే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మం ప్రకారం కుటుంబంలో కార్యక్రమాలు జరుగుతున్నాయా అని నిలదీశారు. జగన్ ఏరోజైనా సతీ సమేతంగా స్వామి వారికి పట్టువస్త్రాలు ఇచ్చారా.. అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇక నెటిజన్లు కూడా వైసీపీని ఆడుకుంటున్నారు. పాపం ఏదో చేయాలనుకుంటే.. మరేదో అయ్యింది.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.