Saturday, September 19, 2026 10:18 PM
Saturday, September 19, 2026 10:18 PM

గవర్నర్ లకు సుప్రీం పరోక్ష వార్నింగ్

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ల తీరుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరాన్ని పెంచింది అనే మాట వాస్తవం. ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సిఎం గా వాతావరణం కనపడుతోంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది. తమిళనాడు గవర్నర్ వ్యవహారం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

Also Read : అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. అసలేం జరిగింది..?

గవర్నర్లు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లును వెనక్కి పంపిన తర్వాత అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి నివేదించలేరు అని పేర్కొంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం సహా.. అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులకు గవర్నర్ ఆమోదించక పోవడం పై సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. నేడు దీనిపై సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది.

Also Read : మొత్తం మీరే చేశారు.. ఇవిగో సాక్ష్యాలు..!

తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి జస్టిస్ జెబి పార్ధివాలా,జస్టిస్ మహదేవన్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తీర్పు సందర్భంగా తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతికి బిల్లులను పంపడం గవర్నర్ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని కోర్ట్ అభిప్రాయపడింది. తమిళనాడు గవర్నర్ డాక్టర్ ఆర్‌ఎన్ రవి 2020 జనవరి నుండి పెండింగ్‌లో ఉన్న 12 బిల్లులకు అనుమతివ్వకుండా, రాష్ట్ర శాసనసభ తిరిగి ఆమోదించిన వాటిని రాష్ట్రపతికి సిఫారసు చేయడం చట్టవిరుద్ధం, తప్పుగా పేర్కొంది. పది బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండో రౌండ్‌లో వాటిని సమర్పించినప్పుడు గవర్నర్ ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తాం అని కోర్ట్ ప్రకటించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్