Wednesday, August 5, 2026 01:11 PM
Wednesday, August 5, 2026 01:11 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవర్ డ్రైవ్..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకాక.. మొత్తం 20,794 ఓట్లు పోలయ్యాయి అందులో 659 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఇక మిగిలిన 20వేల 135 కోట్లలో 50% కంటే ఒక ఓటు అదనంగా సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు.

Also Read : ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. కారణం అదే..?

అంటే ఎవరో ఒక అభ్యర్థికి 10,068 ఓట్లు రావాల్సి ఉంది. గాదె శ్రీనివాసులు నాయుడుకి మొదట 7210 ఓట్లు రాగా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6845 ఓట్లు వచ్చాయి. యుటిఎఫ్ అభ్యర్థి గోరేట్ల విజయ గౌరీకి 5804 ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న మిగిలిన ఏడుగురు అభ్యర్థులకు 100 కంటే తక్కువ ఓట్లు రావడంతో వారిని ఎలిమినేట్ చేశారు అధికారులు. ఇక మొదటి ప్రాధాన్యత ఓటులో మ్యాజిక్ ఫిగర్ కు ఎవరు చేరువ కాకపోవడంతో మూడో స్థానంలో నిలిచిన విజయ గౌరీ కి వచ్చిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా శ్రీనివాసులు నాయుడికి 9237 ఓట్లు వచ్చాయి.

Also Read : ఆస్ట్రేలియా అంటే ఎందుకింత భయం..?

ఇక రఘు వర్మకు 8527 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. శ్రీనివాసులు నాయుడు ఎన్నికకు 831 ఓట్లు అవసరం కాక దీనితో రెండో స్థానంలో నిలిచిన రఘు వర్మకు లభించిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఓట్లు రావడంతో శ్రీనివాసులు నాయుడుని అధికారులు విజేతగా ప్రకటించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది.. కానీ ఇక్కడ వైసిపి సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి మాత్రం ఆశ్చర్యం కలిగించింది.

Also Read : నటరాజన్ టీమ్ రెడీ.. టీపీసీసీలో పదవులు ఎవరికంటే..?

కృష్ణా- గుంటూరు, ఉభయ గోదావరిలో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్ధులు ఓడిపోయారు. అలాగే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వానికి లింకు పెడుతూ వైసిపి నేతలు కామెంట్ చేస్తున్నారు. వైసిపి విజయం సాధించింది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ మద్దె ఇచ్చిన అభ్యర్థి గోరేట్ల విజయగౌరీ లభించిన ఓట్లు 5804 ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాము ఓడిపోయామనే విషయాన్ని కవర్ చేసుకోవడానికి కూటమిపై వ్యతిరేకత అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్