వైసీపీ నేతల తీరు విచిత్రంగా ఉంది. ఇంకా చెప్పాలంటే… వైసీపీ తరఫున ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభకు వచ్చిన ధైర్యంగా ప్రశ్నించాల్సిన ఎమ్మెల్యేలు… గైర్హాజరవుతున్నారు. అయితే… తమ వల్లే సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే ప్రచారం చేసుకునేందుకు వైసీపీ నేతలు కొత్త కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. దీనికి కూటమి నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు.
Also Read : సజ్జల అరెస్టు ముహుర్తం ఖరారైందా..?
వై నాట్ 175 అని చెప్పిన జగన్… 11 స్థానాలు మాత్రమే రావడంతో.. పరువు పూర్తిగా పోయింది. దీంతో అసెంబ్లీలో ముఖం చూపించేందుకు ఇబ్బందిపడిన ఇబ్బంది పడిన జగన్… గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం సరిగ్గా 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తామంతా ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. సభకు వస్తే గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కూటమి సర్కార్ నేతలు నిలదీస్తారనే భయంతో సభకు రాకుండా భయటే తిరుగుతున్నారు. పార్టీ ఆఫీసు నుంచి కొందరు నేతలు ప్రెస్‌మీట్‌లు పెడుతుంటే… మరికొందరేమో… సోషల్ మీడియాలో పోస్టులతో సరిపెడుతున్నారు. దీనిపై కూడా విమర్శలు తలెత్తడంతో తాము కూడా ప్రజాప్రతినిధులమే అని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read : దువ్వాడకు డీజే మోత ఖాయమా..?
సభకు వచ్చిన వేయాల్సిన ప్రశ్నలను స్పీకర్‌కు నేరుగా పంపుతూ… ప్రభుత్వం నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తాటిపర్్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, బి.విరూపాక్షి పంపిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని కూడా లోకేష్ వెల్లడించారు.
Also Read : నటరాజన్ టీమ్ రెడీ.. టీపీసీసీలో పదవులు ఎవరికంటే..?
వైసీపీ ఎమ్మెల్యేలు పంపిన ప్రశ్నకు జవాబివ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తనదైన శైలిలో మంత్రి లోకేష్‌కు సూచించారు. మెగా డీఎస్సీపై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగారు. కానీ అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్లిపోయారు. కనీసం టీవీల్లో అయినా చూస్తారు… మీరు జవాబు చెప్పండి అంటూ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చెప్పడంతో సభలోని కూటమి నేతలంతా నవ్వుకున్నారు. సభకు వచ్చి అడిగితే ఇంకా బాగుంటుందని… సభకు వచ్చేందుకు ధైర్యం లేదా అని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. సభకు రాకపోయినప్పటికీ.. తమ గుర్తింపు కోసం ఇలా ప్రశ్నలు పంపుతున్నారని ఎద్దేవా చేశారు.

