Friday, March 6, 2026 08:35 PM
Friday, March 6, 2026 08:35 PM

సత్యం, నమ్మకం.. వైసీపీ నోట వింత మాటలు..!

భక్తి ముసుగులో ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా..? ఇది వైసీపీ నేతలు ఇప్పుడు వేస్తున్న ప్రశ్న. భక్తులారా.. A Must Watch Documentary.. అంటూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లలో ఆ పార్టీ విడుదల చేసింది. ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుంది చంద్రబాబు.. అంటూ ఆయనకు ట్యాగ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు దాని నుంచి తప్పించుకునేందుకు వింత కథలు చెబుతున్నారు. సత్యం, ధర్మం, మోసం అంటూ సూట్ కాని మాటలను సూట్ అయ్యేలా చెబుతున్నారు.

Also Read : స్వామి అంటే నమ్మకం లేదా..? అసెంబ్లీ లో బాబు ఫైర్..!

“శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైయస్‌ఆర్‌ జీవోలు ఇచ్చారు. కానీ ఆయనపైనే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బుదర జల్లాడు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిబద్ధతతో వైయస్ జగన్ పనిచేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశాడు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశాడు” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని వైసీపీ నేతలు పూర్తిగా మర్చిపోయారా.. లేక మర్చిపోయినట్లు నటిస్తున్నారా.. అనే విషయం మాత్రం అర్థం కావటం లేదు.

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం అని సాక్షాత్తూ నాటీ టీటీడీ మాజీ చైర్మన్, జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఇక తిరుమల అన్న ప్రసాదం మొదలు, లడ్డూ ప్రసాదం వరకు గతంలో ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది భక్తులే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో లడ్డూ 2 రోజులకే వాసన వచ్చిందని.. ఇప్పుడు మాత్రం కమ్మటి నెయ్యి వాసన వారం రోజుల వరకు వస్తూనే ఉందంటున్నారు. ఇక అన్న ప్రసాదం పై అయితే ఏకంగా వీదేశీయులు కూడా వీడియోలు చేస్తూ.. ఆహో ఓహో అంటున్నారు. మరి ఈ వీడియోలు వైసీపీ నేతలకు కనిపించటం లేదా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. జీడిపప్పు నాణ్యత పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి.. యాలకులు, నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవనే అనుమానంతో వాటిని పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించాను.. అంటూ 2022 మే 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించిందని స్వయంగా వైవీ అంగీకరించారు. మరి 2022లో ఏ పార్టీ అధికారంలో ఉందో.. అప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరున్నారో వైసీపీ పెద్దలు మర్చిపోరారా..?

Also Read : నికోటిన్ గమ్ లు వాడుకోవచ్చా..?

సతీసమేతంగా ఏ రోజు గుడికి వెళ్లని జగన్.. ప్రజలను నమ్మించేందుకు.. ఇంకా చెప్పాలంటే.. తప్పుదోవ పట్టించేందుకు ఇంటి ముందు గుడి సెట్ వేసి మరీ సినిమా పాటలు పాడించారు. ఇలాంటి జగన్.. ఇప్పుడు భక్తుల నమ్మకం, ధర్మ పరిరక్షణ అంటూ వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ కనీసం ఒక్కసారి కూడా సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఏ ఆలయానికి తమ భార్యలతో రాలేదు. అది తిరుమల అయినా, దుర్గ గుడి అయినా, శ్రీశైలం అయినా, సింహాచలం అయినా, ఒంటిమిట్ట అయినా సరే.. మా అన్న సింగిల్ అని ఆ పార్టీ కార్యక్రతలు చెబుతున్నట్లుగా ఒక్కరే వచ్చారు తప్ప.. కనీసం ఒక్క పుణ్యక్షేత్రం మెట్లు కూడా ఎక్కలేదు, మొక్కలేదు. ఇలాంటి వైఎస్ కుటుంబం ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ అంటూ వింత వ్యాఖ్యలు చేస్తోంది.

ప్రభువా క్షమించు అంటూ సాక్షి పత్రికలో తాటికాయంత అక్షరాలో వివరణ రాసిన జగన్.. తిరుమలలో జరిగిన ఎన్నో అక్రమాలకు, అవినీతికి, దారుణాలకు ఒకసారి కూడా క్షమాపణ కోరలేదు. సత్యానికి, నమ్మకానికి ప్రమాదం వాటిల్లినప్పుడు ఆ దేవుడే స్వయంగా రంగంలోకి దిగుతాడని వైసీపీ వీడియోలో చెప్పుకొచ్చింది. అంతర్వేది రథం, దుర్గ గుడిలో వెండి సింహాల చోరి, సింహాచలం కొండపై పెత్తనం చేసినందుకు.. ఆ దేవుడికి కోపం వచ్చినట్లు ఉంది. అందుకే వైసీపీకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఆ దేవుడే దింపేశాడు. నిజాన్ని ప్రపంచానికి చూపించాడు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి ఆ దేవుడే సరైన శిక్ష వేశాడు.

Also Read : దువ్వాడకు రూల్స్ తెలియదా..? మరో వివాదంలో మాధురి..!

బ్రిటీష్ సర్కార్ మొదలు ఎన్టీఆర్ ప్రభుత్వం వరకు టీటీడీ పరిధిని 27.5 చదరపు కిలోమీటర్లుగా గుర్తించారని.. ఇందుకు సంబంధించి జీవో నంబర్ 1784 విడుదల చేసిందని.. కానీ 2007 జూన్ 2న జీవో నంబర్ 746ను వైఎస్ఆర్ విడుదల చేశారని.. తిరుమల పరిధిని 322.68 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించారని.. 7 కొండలను టీటీడీ పరిధిలో చేర్చారని.. స్వామి వారి వైఎస్ఆర్ ఎంతో మేలు చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సత్యదూరమైన ఆరోపణలు చేశారని వీడియోలో చెప్పారు. కల్తీ నెయ్యి అని వైవీ స్వయంగా ఒప్పుకున్న తర్వాత సత్య దూరం అంటే ఏమిటో వైసీపీ నేతలె చెప్పాలి. కల్తీ నెయ్యి వినియోగించినట్లు సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయంపై స్పష్టంగా వివరించింది కూడా. అయినా సరే.. వైసీపీ మాత్రం.. సీబీఐ ఇచ్చిన నివేదికలో కల్తీ అనే మాటే లేదన్నట్లుగా సత్య దూరమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు నానా పాట్లు పడుతోంది.

2019-2024 మధ్యలో తిరుమలలో ఏ చిన్న పొరపాటు జరగలేదంటా.. కల్తీ జరిగినట్లు చంద్రబాబు పదే పదే చెబుతున్నారని.. నెయ్యి శాంపిల్ తీసుకున్నది 2024 జులై, ఆగస్టు లోదని చెప్పుకొచ్చారు. బొలేబాబా, వైష్ణవి వంటి సంస్థలకు చంద్రబాబు హయాంలో కూడా అనుమతి ఇచ్చారని.. కేవలం తన వాళ్లకు, తన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల స్వామి వారిని మరింత అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ వచ్చింది ఎవరి హయాంలో.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. పాత కాంట్రాక్టులన్నీ రద్దు చేసి.. రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్లీ టెండర్లు పిలిచిన విషయం మర్చిపోయారేమో వైసీపీ నేతలు. మరి రివర్స్ టెండర్ దక్కించుకున్న సంస్థ ఎలాంటి నెయ్యి సరఫరా చేస్తుందో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా అనే టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Also Read : అంగన్వాడీలు, ఆశావర్కర్ల సమస్యల పై లోకేష్ కీలక వ్యాఖ్యలు

జన బలం ఉన్న కుటుంబాన్ని ఎదుర్కొలేక మతాన్ని, దేవుడ్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నిజమే.. ఆ కుటుంబానికి ఎంత బలం ఉందో.. 2024 ఎన్నికల్లోనే రుజువైంది. సొంత అన్న మీదే చెల్లెలు ఆరోపణలు చేశారు. తల్లి కూడా జగన్ కంటే షర్మిలకే ఓటు వేయమని కోరారు. మరో చెల్లెలు కూడా తన అన్నను ఓడించాలన ప్రచారం చేశారు. ఆస్తి కోసం చెల్లి, తల్లిని గెంటేసిన నేత వైఎస్ జగన్. అలాంటి జగన్ దేవుడికి మేలు చేశారని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం.. ఇప్పుడు హాస్యాస్పదం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇండియాతో అమెరికా కామెడీ.....

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ద...

స్వామి అంటే నమ్మకం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

దువ్వాడకు రూల్స్ తెలియదా..?...

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల...

ఆ విషయంలో వైసీపీ...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు...

అంగన్వాడీలు, ఆశావర్కర్ల సమస్యల...

అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలతో చర్చించేందుకు...

మరో దేశంపై ట్రంప్...

ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం నిరంతరం...

పోల్స్