Saturday, August 22, 2026 01:15 PM
Saturday, August 22, 2026 01:15 PM

ఓట్స్, బాదం పాలు తాగితే ఇంత మంచిదా..?

ప్రకృతిలో దొరికే ఎన్నో ఆహార పదార్ధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. అందులో ఓట్స్, బాదం పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదం, వోట్స్ పాలు రెండూ గుండెకు మంచివే అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం, గుండె ఆరోగ్యాన్ని పోషించే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వీటిలో అధిక మోతాదులో ఉన్నాయి. దీనితో పాటు, బాదం పాలు.. గుండె రక్త ప్రసరణను మెయింటేన్ చేసేందుకు సహకరిస్తాయి. దీని ప్రభావం శరీరంపై పడుతుంది.

Also Read : 24 గంటల ఉపవాసం చేస్తే ఇన్ని లాభాలా..?

కొలెస్ట్రాల్ నిర్వహణ కూడా ఇక్కడ కీలకం. గుండె కండరాల రక్షణ, జీవక్రియ ఆరోగ్యానికి బాదం పాలు చాలా మేలు చేస్తాయి. వోట్స్ పాలలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే గుండె ప్రమాద కారకాలను కంట్రోల్ చేస్తుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, వోట్స్ పాలలో బి-గ్లూకాన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ ప్రకారం, ఓట్స్ బి-గ్లూకాన్ పిత్త ఆమ్లాలు, గట్ మైక్రోబయోమ్‌ ను కంట్రోల్ చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి.

Also Read : బూమ్రాకు ప్రత్యామ్నాయం ఎక్కడ..?

బాదం పాలు కేలరీలు ఎక్కువగా తీసుకునే వారికి, డయాబెటిస్ ప్రమాదం ఉన్నవారికి మేలు చేస్తాయి. ఓట్స్ మిల్క్ కొలెస్ట్రాల్ నిర్వహణకు మంచిది. జీర్ణ ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయి. బాదం పాలు గింజల నుండి తయారవుతాయి కాబట్టి అలెర్జీల ప్రమాదం ఉంటుంది. కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివిటీ కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు. వైద్యపరంగా చెప్పాలంటే, బాదం, వోట్స్ పాలు రెండూ గుండె ఆరోగ్యానికి, ముఖ్యంగా జన్యుపరంగా గుండె జబ్బులకు గురయ్యే వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ...

అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సాయి రెడ్డితో రాజీ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్...

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

పోల్స్