Thursday, February 12, 2026 05:33 PM
Thursday, February 12, 2026 05:33 PM

బూమ్రాకు ప్రత్యామ్నాయం ఎక్కడ..?

గత నాలుగేళ్ల నుంచి టీం ఇండియా కీలక బౌలర్ ఎవరూ అనగానే వినపడే పేరు జస్ప్రిత్ బూమ్రా. విరాట్ కోహ్లీ సారధ్యంలో జట్టులోకి వచ్చిన బూమ్రా.. ఆ తర్వాత భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. మరి బూమ్రా ఫిట్నెస్ సంగతి ఏంటీ..? బూమ్రా గాయపడితే భారత బౌలింగ్ విభాగం సంగతి ఏంటీ..? ఇవే ఇప్పుడు అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. 2024 – 2025 ఆస్ట్రేలియా పర్యటనలో బూమ్రా 5 టెస్ట్ లు ఆడాడు. చివరి టెస్ట్ లో పూర్తిగా అందుబాటులో లేడు.

Also Read : మ్యాచ్ అంటే ఇది.. టి20 చరిత్రలో అద్భుతమే..!

ఆ సీరీస్ లో ప్రదర్శన పరంగా కూడా బూమ్రా ఆకట్టుకున్నాడు. కానీ.. ఆ తర్వాతి నుంచి బూమ్రా తాను 5 టెస్ట్ లు ఆడలేను కేవలం 3 మాత్రమే ఆడతాను అంటూ యాజమాన్యానికి చెప్పేసాడు. ఇక ఆ తర్వాతి నుంచి ఫిట్నెస్ సమస్యలు కూడా అతనిని ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఐపిఎల్ మ్యాచ్ లకు మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటున్నాడు ఈ బౌలర్. ఇంగ్లాండ్ పర్యటనలో మూడు టెస్ట్ లు కష్టంగా ఆడాడు. పేస్ కు అనుకూలంగా ఆ పిచ్ లపై ఆకట్టుకోలేదు బూమ్రా. మూడు ఫార్మాట్ లకు బూమ్రాను ఎంపిక చేస్తున్నారు.

Also Read : టీం ఇండియాకు ఓపెనర్ షాక్..?

కానీ బూమ్రా మాత్రం పూర్తిగా అందుబాటులో ఉండటం లేదు. టి20 వరల్డ్ కప్ కు ముందు కూడా బూమ్రాపై అనుమానాలు వచ్చాయి. దీనితో బూమ్రాకు ప్రత్యామ్నాయం చూడాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ కూడా ఉంది. కాబట్టి బూమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్ ను తయారు చేయాల్సి ఉంటుంది. హర్షిత్ రానా లేదా ప్రసిద్ కృష్ణను తయారు చేసే ప్రయత్నం చేసినా వారు ఆకట్టుకోవడం లేదు. మయాంక్ యాదవ్ లేదా శివం మావీ అందుబాటులో ఉన్న బౌలర్ లు. అందుకే వారిని పూర్తి స్థాయిలో వాడుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా...

ఇది చంద్రబాబు ఇచ్చే...

గత ఏడాది కాలంగా ఏపీలో తిరువూరు...

లిక్కర్ కేసుపై సుప్రీం...

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దర్యాప్తులో ఇప్పటికీ...

సెలవు పై ఐఏఎస్...

సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్...

బిల్డప్ అదుర్స్.. బొమ్మ...

అసెంబ్లీకి జగన్.. కూటమిలో వణుకు..! ఈ...

లోకేష్ డిన్నర్ మీట్.....

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా...

పోల్స్