Friday, July 3, 2026 05:52 PM
Friday, July 3, 2026 05:52 PM

మెగా ఫ్యాన్స్ కు వెయింటింగ్ తప్పదా..? పెద్ది వాయిదా పడ్డట్టే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదే సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిందనే న్యూస్. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ విడుదల తేదీ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Also Read : ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత విద్యార్థులకు చుక్కలు..!

సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు, ప్రతి సీన్‌ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఏప్రిల్ నెలాఖరుకు సినిమాను సిద్ధం చేయడం కష్టమని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సినిమాను జూన్ 2026కి వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

Also Read : ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత విద్యార్థులకు చుక్కలు..!

సమ్మర్ సీజన్ చివరలో లేదా జూన్ నెలలో మంచి డేట్ చూసుకుని గ్రాండ్‌ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, రామ్ చరణ్ తదుపరి చిత్రం కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. రామ్ చరణ్ ఇందులో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌ లో కనిపించబోతున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల వాయిదా పడినా, అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

పోల్స్