Thursday, September 17, 2026 08:13 PM
Thursday, September 17, 2026 08:13 PM

ఇండక్షన్ టూ ఎల్పీజీ.. వంట చేసుకోవడానికి ఏది బెస్ట్..?

వంట గ్యాస్ ధరలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్యులు ఏ విధానంలో వంట చేసుకుంటే ఇప్పుడు చౌకగా ఉంటుంది..? దీని గురించి సామాన్యుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎల్ పీ జీ, పీఎన్జీ, ఇండక్షన్ స్టౌ, ఎలక్ట్రిక్ స్టౌ లలో ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నదో ఒకసారి చూద్దాం. చాలా కాలంగా మనం వాడుతున్నది ఇదే ఎల్పీజీ. ఒక సిలిండర్ ధర ప్రస్తుతం సుమారు రూ. 850 నుంచి రూ. 50 మధ్యలో ఉంది. కరెంట్ తో సంబంధం లేకుండా వంట చేసుకోవచ్చు. కానీ.. దీని ఎఫిషియన్సీ తక్కువ.

Also Read : దెబ్బకు దారిలోకి వచ్చిన ట్రంప్..!

అంటే మంటలో 40-50% వేడి గాలిలో కలిసిపోతుంది, కేవలం సగం వేడి మాత్రమే పాత్రకు అందుతుంది. పీఎన్‌జీ విషయానికి వస్తే.. పైపుల ద్వారా వచ్చే గ్యాస్. ఇది ఎల్ పీ జీ కంటే 15% నుండి 20% వరకు చౌకగా ఉంటుంది. మీరు వాడిన యూనిట్ల బట్టే బిల్లు వస్తుంది. సిలిండర్ బుక్ చేసే పని, అయిపోతుందనే భయం ఉండదు. నగరాల్లో ఉండేవారికి ఇది ఎల్ పీ జీ కంటే ఉత్తమమైన, చౌకైన ఆప్షన్. ఇండక్షన్ కుక్కర్ విషయానికి వస్తే.. ప్రస్తుత కాలంలో దీనికి ఆదరణ పెరిగింది. దీని ఎఫిషియన్సీ 90% వరకు ఉంటుంది. అంటే విద్యుత్ శక్తి నేరుగా వేడిగా మారి పాత్రకు అందుతుంది.

Also Read : కవిత పార్టీ పేరు ఇదే..? పొలిటికల్ రీ-ఎంట్రీకి రెడీ..!

నెలకు రూ. 500 నుండి రూ.700 ఖర్చు కావచ్చు. ఎల్పీజీ ధర 900 దాటినప్పుడు, ఇండక్షన్ వాడటం సుమారు 30% చౌకైనది. కానీ దీనికి ప్రత్యేకమైన పాత్రలు ఉండాలి. ఎలక్ట్రిక్ స్టౌ / కాయిల్ హీటర్ విషయానికి వస్తే ఇందులో కాయిల్ వేడెక్కడం ద్వారా వంట జరుగుతుంది. ఇది ఇండక్షన్ కంటే ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. వేడి అవ్వడానికి, చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇండక్షన్ కంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇండక్షన్ కుక్కర్ చౌకైన విధానంగా చెప్తారు. విద్యుత్ యూనిట్ ధర రూ.7-8 లోపు ఉన్నంత కాలం ఇదే అన్నిటికంటే చౌకైన మార్గం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్