Sunday, September 20, 2026 07:22 AM
Sunday, September 20, 2026 07:22 AM

త్వరలో భారత్ కు ట్రంప్ మరో షాక్..!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెండు దఫాలుగా 50 శాతం సుంకాలను డోనాల్డ్ ట్రంప్ విధించడం ఆందోళన కలిగించింది. అయితే భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు ఆపడం లేదు. భారత చమురు శుద్ధి కర్మాగారాలు ముందు కొంత ఆగినప్పటికీ భారత ప్రభుత్వం జోక్యంతో మళ్ళీ దిగుమతులు మొదలుపెట్టాయి. దీనితో ట్రంప్ మరోసారి రియాక్ట్ అయ్యారు.

Also Read : బంగ్లాదేశ్ తో క్రికెట్ క్యాన్సిల్..? బీసీసీఐ సంచలన నిర్ణయం..?

రష్యా చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు భారత్ పై కొత్త సుంకాలను విధించే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యలు చేసారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషంగా లేకపోయినా తప్పడం లేదు అంటూ కామెంట్ చేసారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. తన నిర్ణయాలతో ఆయన సంతోషంగా లేడని తనకు తెలుసు అని, వారి నిర్ణయాలతో తాను సంతోషంగా లేను అనే విషయం కూడా మోడీకి తెలుసు అన్నారు ట్రంప్.

Also Read : వాళ్లకు మళ్ళీ నిరాశే.. ఇదేం సెలెక్షన్ అగార్కర్..?

వారు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు, అందుకే మరోసారి సుంకాలు మళ్ళీ పెరుగుతాయన్నారు ట్రంప్. ఇటీవల ట్రంప్ తో ప్రధాని మోడీ మాట్లాడిన కొన్ని రోజులకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుంకాల ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉమ్మడి ప్రయత్నాలు మరింత దూకుడుగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఇద్దరూ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. రష్యాతో చమురు వ్యాపారం ఆగిపోయిన రెండు నిమిషాల్లో సుంకాలు ఓ కొలిక్కి వస్తాయని ట్రంప్ కామెంట్ చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్