Tuesday, May 19, 2026 06:30 AM
Tuesday, May 19, 2026 06:30 AM

ఈరోజు రాశి ఫలితాలు (19-05-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 19-05-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

వృషభం

ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

—————————————

మిధునం

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

—————————————

కర్కాటకం

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

—————————————

సింహం

ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

కన్య

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

—————————————

తుల

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

వృశ్చికం

ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది.

—————————————

ధనస్సు

ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

—————————————

మకరం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

—————————————

కుంభం

ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

—————————————

మీనం

బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సమన్యాయం అంటే ఇదేనేమో..!

“ఒక కేసు అనేక ప్రశ్నలు, అనేక...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు...

అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న...

సైనికులకు రొయ్యలు పెట్టండి.....

రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా...

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

పోల్స్