Sunday, September 20, 2026 03:42 AM
Sunday, September 20, 2026 03:42 AM

ఆత్మాహుతే.. కారు నడిపిన ఎంబీబీఎస్ డాక్టర్..!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఇప్పుడు కలవరం రేపుతోంది. ఇప్పటివరకు సరిహద్దుల్లోనే దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు.. నేరుగా దేశ రాజధానిని టార్గెట్ గా చేసుకుని బాంబు దాడులకు పాల్పడ్డారు. ఎర్రకోట వద్ద నిన్న సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో పదిమంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు హోంశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ దాడులకు సంబంధించి దర్యాప్తు బృందాలు పెద్ద ఎత్తున విచారణ వేగవంతం చేశాయి.

Also Read : బ్రేకింగ్: విషమంగా అలనాటి స్టార్ హీరో ఆరోగ్యం

ఎర్రకోట పేలుళ్లు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. జై శై మహమ్మద్ కు చెందిన డాక్టర్ ఉమర్ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్న కారును అతను బాంబులతో నింపి ఎర్రకోట వద్దకు తీసుకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో ఇతను పరారీలో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు తెలిపాయి. గత రెండు రోజుల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ నుంచి అత్యంత రహస్యంగా వాటిని తరలించినట్లు గుర్తించారు.

Also Read : చెవిలో ఇయర్ బడ్స్ పెట్టొద్దు.. మరి ఎలా శుభ్రం చేసుకోవాలి..?

ఇక తాజాగా జరిగిన పేలుడులో అతను మరణించినట్లు హోం శాఖ వెల్లడించింది. అతన్ని డిఎన్ఎ ద్వారా గుర్తించేందుకు ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలిపింది. 2019లో పుల్వామాలోను వాహనంలో పేలుడు పదార్థాలు ఉంచి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా అదే తరహాలో దేశ రాజధాని లో దాడికి దిగారు ఉగ్రవాదులు. రెండు రోజుల కిందట పట్టుబడిన డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజామిల్ అహ్మద్ ను ప్రస్తుతం ఇంటిలిజెన్స్ బ్యూరో విచారిస్తోంది. ఇక మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశాయి బలగాలు. బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్