Saturday, September 19, 2026 07:37 PM
Saturday, September 19, 2026 07:37 PM

జగన్ చేతుల్లోంచి జారిపోతున్న సొంత జిల్లా

ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దూకుడు రాజకీయం చేస్తోంది. కూటమిలో ఇతర పార్టీలతో సంబంధం లేకుండా కొన్ని రాజకీయ లక్ష్యాల విషయంలో చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వరుసగా మున్సిపాలిటీలను కైవసం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇటీవల కొన్ని కీలక మున్సిపాలిటీల మీద దృష్టి పెట్టి వాటిని టీడీపీ దాదాపుగా కైవసం చేసుకుంది అనే చెప్పాలి. రాయలసీమ జిల్లాల మీద కూడా టీడీపీ దృష్టి సారించింది. వైజాగ్ ని కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Kadapa MLA Reddeppagari Madhavi Reddy

అలాగే జిల్లా పరిషత్ ల మీద కూడా చంద్రబాబు దృష్టి పెట్టారని వైసీపీలో కలవరం మొదలయింది. ముఖ్యంగా కడప కర్నూలు జిల్లాల మీద చంద్రబాబు దృష్టి పెట్టారనే ఆందోళన వైసీపీ నేతల్లో ఎక్కువగా నెలకొంది. కడప మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవి వేగంగా అడుగులు వేస్తున్నారు. అక్కడ కొందరు కార్పొరేటర్లు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె భావిస్తున్నారు. వారిని ఎలా అయినా కట్టడి చేయాలని మాధవి ఇప్పుడు వ్యూహం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే పులివెందుల మీద కూడా దృష్టి పెట్టారట. వైఎస్ జగన్ కి పక్కలో బల్లెం లాగా బిటెక్ రవి అక్కడ రాజకీయాలు చేస్తున్నారు.

YS Jagan Mohan Reddy

ఇదిలా ఉంచితే కడప జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వైఎస్‌ జగన్‌తో కడప జిల్లా జడ్పీటీసీలు ఈరోజు తాడేపల్లిలో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. జడ్పీ చైర్మన్ పీఠం విషయంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో పలువురు జడ్పిటిసిలు టిడిపి వైపు చూస్తున్నారని ప్రచారంతో అప్రమత్తమైన జగన్… వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సొంత జిల్లాలో జడ్పీ చైర్మన్ కాపాడుకోవడం కోసం వైసీపీ అధినేత నాయకులతో సమావేశం అయ్యారు. ఈ స్థానం కోల్పోతే పార్టీ జిల్లాలో మరింత బలహీన పడుతుంది అనే ఆందోళన ఆయన నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్