Thursday, August 6, 2026 03:39 AM
Thursday, August 6, 2026 03:39 AM

అప్రూవర్ గా మారిన సింగ్.. జగన్ పిఏ అవినీతి బాగోతం…!

ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ళుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్న వైసీపీ నేతల బండారాలు అన్నీ బయటపడుతున్నాయి. ఒక్కో అవినీతి పుట్టను పెకలిస్తూ ఏపీ ప్రభుత్వం విచారణలు ముమ్మరం చేసింది. తాజాగా సినిమా వాళ్ళతో కలిసి చేసిన అవినీతి, అక్రమాలు బయటపడ్డాయి. ఏపీలో తాజాగా భారీ స్కాం బయటపడింది. ఏపీలో ఏడు వందల కోట్ల భూస్కాం జరిగినట్టు గుర్తించారు. అప్రూవర్ గా రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ మారనున్నాడు. కొన్నాళ్ళుగా తప్పించుకుని తిరిగిన సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : ఇంటర్ మార్కుల శాడిజానికి చెక్.. ఫస్ట్ ఇయర్ పరిక్షలు రద్దు..!

పోలీస్ కస్టడీలో సంచలన విషయాలను రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ బయటపెడుతున్నాడు. జగన్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు విప్పుతానంటున్న సింగ్… ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చేసాడు. తాను సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఉన్న అంశాలకి కట్టుబడి ఉంటానని సింగ్ పేర్కొన్నాడు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పిస్తామని తెలిపాడు. ఏసీబీ కస్టడీలో ముఖ్యమైన వైసీపీ నేతల పేర్లను అతను బయటపెట్టాడు. అప్పటి సీఎంవో కార్యాలయం నుంచి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు అందాయని సింగ్ బయటపెట్టాడు.

Also Read : మరో మాజీ ఎండీ అరెస్ట్..?

తనకు అవకాశమిస్తే అందరి బండారం బయటపెడతానన్న సింగ్.. జగన్ పీయే కేఎన్నార్ అన్నింటికీ సూత్రధారి అంటూ బాంబు పేల్చాడు. కేఎన్నార్ ఆస్తుల చిట్టాను అధికారుల ముందు బయటపెట్టాడు. శ్రీకాంత్, రీతూ చౌదరి పేరున రిజిస్ట్రేషన్ చేసిన అక్రమ ఆస్తుల వివరాలను సింగ్ బయట పెట్టాడు. రీతూ చౌదరిని … శ్రీకాంత్ గోవా తీసుకొచ్చేవాడన్న సింగ్.. ఈ వ్యవహారాల్లో శ్రీకాంత్ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపాడు. ఇక సింగ్ కస్టడీ ముగిసాక శ్రీకాంత్ ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో రీతూ చౌదరిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. సింగ్ ఇచ్చిన సమాచారం, ఆధారాల నేపథ్యంలో జగన్ పీఏ కేఎన్నార్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్