Saturday, June 20, 2026 08:37 PM
Saturday, June 20, 2026 08:37 PM

బ్రేకింగ్: కేసీఆర్ కు సిట్ నోటీసులు

తెలంగాణలో అత్యంత సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో దాదాపుగా కేసీఆర్ ను విచారించే అవకాశం ఉందని, గత పది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు.

Also Read : ఢిల్లీలో పవన్.. అమిత్ షాతో భేటీపై ఉత్కంట..!

ఇక ఈ కేసులో బాధితులను, సాక్షులను కూడా విచారించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరిగింది. ప్రధాన కేసుకు సంబంధించి కాకుండా, పంజాగుట్టలో నమోదైన ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే పార్టీ కీలక నేతలను విచారించిన సంగతి తెలిసిందే. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం నోటీసు ఇచ్చి విచారించారు. ఇప్పుడు కేసీఆర్ కు కూడా అదే నోటీసు ఇచ్చి విచారించనున్నారు. అనారోగ్య కారణాలతో కేసీఆర్ ను, విచారణకు పిలవకుండా ఆయన ఫామ్ హౌస్ లోనే విచారించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Also Read : చెవిరెడ్డికి బెయిల్.. ఆయన్ను మాత్రం వదలని హైకోర్ట్..!

రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. దీనితో ఈ కేసులో తదుపరి అరెస్టులు ఏమైనా ఉంటాయా అనేదానిపై కూడా ఆసక్తి నెలకొంది. అటు పోలీసు అధికారులను కూడా సిట్ అధికారులను విచారించే అవకాశం కనపడుతుంది. ఇక మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేని కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్