Wednesday, May 6, 2026 09:20 PM
Wednesday, May 6, 2026 09:20 PM

ఢిల్లీలో పవన్.. అమిత్ షాతో భేటీపై ఉత్కంట..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. చాలా రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో అపూర్వ స్వాగతం లభించింది. ఏపీ ఎన్డియే కూటమి నుంచి సిఎం చంద్రబాబు లేదా మంత్రి నారా లోకేష్ మాత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్ళిన డిప్యూటి సిఎం, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పంచాయితీ రాజ్ శాఖతో పాటుగా అటవీ శాఖకు నిధులు కేటాయించే అంశంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించారు.

Also Read : 18 ఏళ్లు.. 30 ట్రాన్స్‌ఫర్లు.. ఎందుకు ఇంత పగ..?

కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ ను కలిసిన పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో వినతిపత్రం, పలు అంశాలను మంత్రికి వివరించారు. పీఎం గతి శక్తి పథకం కింద పిఠాపురం పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డుపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఉంటుందని మంత్రికి వివరించారు. జాతీయ రైల్వే ప్రణాళిక – 2030లోని మాన్యువల్ లెవల్ క్రాసింగ్‌ లను తొలగించాలనే లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందన్నారు.

Also Read : ఆధారాల్లేకుండా ఆరోపణలు… ఇదేనా సాక్షి జర్నలిజం?

ఇదే పర్యటనలో పవన్ కళ్యాణ్.. మరికొంత మంది కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయిన పవన్.. వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరతో పాటుగా పలు అంశాలను వారి దృష్టికి తీసుకుని వెళ్తారు. వీరి తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు బిజెపికి కొత్తగా చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తో కూడా పవన్ భేటీ కానున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్