Wednesday, May 6, 2026 11:59 PM
Wednesday, May 6, 2026 11:59 PM

మారని గోయెంకా తీరు.. నిన్న రాహుల్ నేడు పంత్ 

ఐపిఎల్ సీజన్ లో లక్నో జట్టు ఆట తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. మూడు మ్యాచుల్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయిన లక్నో జట్టుపై అభిమానులు ఫైర్ మీదున్నారు. ఇది పక్కన పెడితే.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీరుపై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐపిఎల్ సీజన్ లో సంజీవ్ గోయెంకా కెఎల్ రాహుల్ పై అసహనం వ్యక్తం చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాడు.

Also Read : ముంబై సెన్సేషన్ అశ్వనీ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఓడిపోగా.. పంత్ పై ఫైర్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం పంత్ పై సీరియస్ అయినట్టు.. అతని అసహనాన్ని ప్రదర్శించినట్టు పలు ఫోటోలు బయటకు వచ్చాయి. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన సమయంలో కూడా పంత్ పై అతను ఇలాగే సీరియస్ అయ్యాడు. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత లక్నో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో పుంజుకుంది, కానీ మంగళవారం పంజాబ్‌పై ఓటమి పాలైంది. పంత్ పై వేలు చూపిస్తూ మాట్లాడటంపై అభిమానులు అసహనం వ్యక్తం చేసారు.

Also Read : హైదరాబాద్ ను వేటాడుతున్నాడు..!

అతను తన వ్యవహారశైలి మార్చుకోవాలని లేకపోతే… ఐపిఎల్ లో జట్టును వేరే వాళ్లకు విక్రయించాలని.. అంతే గాని క్రికెట్ పై అవగాహన లేని వ్యక్తి పదే పదే ఆటగాళ్ళపై సీరియస్ కావడం ఏంటి అని మండిపడుతున్నారు. స్టార్ ఆటగాళ్ళ పరువు అతను తీస్తున్నాడు అని మరికొందరు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఇక పంత్ ఆట తీరు కూడా గొప్పగా ఎం కనపడలేదు. ఈ సీజన్ లో అతను పెద్దగా రాణించకపోవడంతో అతనికి 27 కోట్లు వృధా అంటూ లక్నో అభిమానులే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్