Wednesday, August 5, 2026 04:56 AM
Wednesday, August 5, 2026 04:56 AM

భారత్ ను భయపెడుతున్న ట్రంప్ డర్టీ 15

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. వీసాల నుంచి వ్యాపారాల.. విద్య నుంచి పన్నుల వరకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవల ఆ దేశ విద్యాశాఖ ను రద్దు చేసిన ట్రంప్.. ప్రపంచ దేశాలపై కక్ష సాధింపు నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం రేపుతున్నాడు. ఏప్రిల్ 2 నుండి కొత్త సుంకాలను విధించడానికి ట్రంప్ సిద్దమయ్యారు. దీనిని అమెరికా విముక్తి దినోత్సవంగా చెప్తున్నారు ట్రంప్. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలకు ట్రంప్ చుక్కలు చూపించడానికి సిద్దమయ్యారు.

Also Read : 5 ఏళ్ళ బటన్ల నొక్కుడుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

సరికొత్త సుంకాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు లేకపోయినా.. కొన్ని దేశాలు ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల కొన్ని దేశాలను..”డర్టీ 15″ అని పిలిచారు. వీటిని ఆయన అమెరికా వస్తువులపై అధిక సుంకాలు, ఇతర వాణిజ్య అడ్డంకులను సృష్టించే 15 అమెరికా వాణిజ్య భాగస్వాములుగా అభివర్ణించారు. ఆ దేశాల ఖచ్చితమైన జాబితాను వెల్లడించనప్పటికీ, అమెరికా వాణిజ్య శాఖ 2024 వాణిజ్య లోటు నివేదిక నుండి వచ్చిన డేటా ప్రకారం చూస్తే ఆ లిస్టులో భారత్ కూడా ఉంది.

Also Read : సల్మాన్ ను వెంటాడుతున్న బ్యాడ్ టైం

చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, జర్మనీ, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, భారతదేశం, థాయిలాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా.. ఈ దేశాలపై అమెరికా భారీ పన్నులు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లలో అధిక సుంకాలు విధించే అవకాశం ఉంది. ఏప్రిల్ 4 నుండి అమల్లోకి రానున్న ఆటోమొబైల్ దిగుమతులు, విడిభాగాలపై సుంకాలు పెరగనున్నాయి. అమెరికాతో అధిక వ్యాపారాలు చేస్తూ కూడా తమను ఇబ్బంది పెట్టే దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు ట్రంప్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్