Wednesday, August 5, 2026 07:16 AM
Wednesday, August 5, 2026 07:16 AM

హైదరాబాద్ ను వేటాడుతున్నాడు..!

ప్రత్యర్థి ఎవరైనా సరే 250 నుంచి 300 వరకు స్కోర్ చేయడం సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్. పిచ్ ఏదైనా సరే.. బౌలర్ ఎవరైనా సరే వెనుకా ముందు చూడకుండా పరుగులు సాధిస్తారు హైదరాబాద్ ఓపెనర్లు. అలాంటి బ్యాటింగ్ లైనప్ కు చుక్కలు చూపిస్తున్నాడు ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఓడిపోవడమే లక్ష్యంగా అతను బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్లు తీసిన స్టార్క్.. కమిన్స్ టీంకు చుక్కలు చూపించాడు.

Also Read : విషమంగా నాని ఆరోగ్యం.. అత్యవసరంగా ముంబై తరలింపు

ముఖ్యంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్.. అభిషేక్ శర్మ విషయంలో ఇతని బౌలింగ్ ఆశ్చర్యపరుస్తుంది. గత ఐపీఎల్ సీజన్ లో కూడా ఇదే తరహాలో బౌలింగ్ చేశాడు. గత ఏడాది జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాటిని వెనక్కి పంపించాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కీలక ఆటగాళ్లు. ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగి.. ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి.. హైదరాబాద్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అతని బౌలింగ్ దెబ్బకు హైదరాబాద్ ఆటగాళ్లు క్రీజ్ లో నిలబడాలంటేనే భయపడిపోయారు.

Also Read : వర్మ కోసం వైసీపీ మైండ్ గేమ్..!

ఖచ్చితమైన వేగంతో బంతులు విసిరుతూ.. స్వింగ్ కంటే ఆటగాళ్ల వీక్నెస్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టి బౌలింగ్ చేశాడు. కీలక సమయంలో హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా హైదరాబాద్ బ్యాటింగ్ లో కీలకంగా ఉన్న ఆటగాళ్లను అవుట్ చేశాడు. దీనితో ఏ దశలో కూడా హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. మిగిలిన బౌలర్ల నుంచి కూడా సహకారం ఉండటంతో.. చాలా జాగ్రత్తగా బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. టి20లలో ఐదు వికెట్లు తీయడం అనేది చాలా అరుదు. కానీ చాలా అలవోకగా స్టార్క్ బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్