Sunday, September 20, 2026 01:06 AM
Sunday, September 20, 2026 01:06 AM

జగన్‌కు షాక్ ఇచ్చిన ఆప్తులు..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత వాళ్లే సహకరించటం లేదా.. వైఎస్ జగన్‌కు నమ్ముకున్న వారే షాక్ ఇచ్చారా.. అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ జగన్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదు. దీనిపై వైసీపీ నేతలు తెగ గగ్గొలు పెడుతున్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదని.. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించలేదని.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోలీసు రాజ్యం ఉందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పులివెందులలో ప్రజలు ప్రశాంతంగా ఓటు వేయలేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

Also Read : అప్పుడు నంద్యాల ఇప్పుడు పులివెందుల.. టీడీపీకి సెంటిమెంట్ భయం..?

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై తొలి నుంచి ఆసక్తి కొనసాగింది. ఈ ఎన్నికను ఇరు పార్టీల నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 30 ఏళ్ల పాటు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరగలేదు. తొలిసారి ఈ స్థానంలో 11 మంది పోటీ చేశారు. ప్రచారం కూడా హోరా హోరీగా సాగింది. చివరికి చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు సజావుగా జరిగాయనేది పోలీసుల మాట. పులివెందులలో ఒక చోట, ఒంటిమిట్టలో ఒక చోట మాత్రమే రీ పోలింగ్ జరిగింది. అయితే వైసీపీ నేతలు మాత్రం.. తమ ఓటమిని ముందే గ్రహించి.. కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్నిక వాయిదా వేయాలని.. వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయమే ఫైనల్ అని.. ఎన్నికల నిర్వహణలో కోర్టులు ఎలాంటి జోక్యం చేసుకోవని ఆ పిటిషన్ తోసి పుచ్చారు. అయితే ఈ ఎన్నిక సజావుగా జరిగినట్లు సర్టిఫికేట్ ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని. దీంతో వైసీపీ నేతలు ఖంగు తిన్నారు. ఇందుకు ప్రధాన కారణం.. నీలం సాహ్నికి వైఎస్ జగన్ అండదండలున్నాయనే మాట. కేంద్ర సర్వీసులో ఉన్న నీలం సాహ్నిని జగన్ ఏపీకి తీసుకువచ్చారు. ఆమె జగన్ అధికారంలో ఉన్న సమయంలో నవంబర్ 2019 నుంచి జనవరి 1, 2021 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో జగన్ చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్లుగా నీలం సాహ్ని వ్యవహరించారు. అందుకే ఆమె సేవలకు మెచ్చిన జగన్.. ఐఏఎస్‌గా పదవీ విరమణ తీసుకున్న 3 నెలలకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి ఇచ్చారు జగన్. ఆమె హయాంలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పుడు వైసీపీ నేతలు దౌర్జన్యాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా కూడా.. సాహ్ని ఏ మాత్రం పట్టించుకోలేదు.

Also Read : వన్డే కెప్టెన్ గా అతనే.. రోహిత్ కు షాక్ తప్పదా..?

ప్రస్తుతం ఉప ఎన్నిక విషయంలో సాహ్ని తమకు పూర్తిగా సహకరిస్తుందని వైసీపీ నేతలు భావించారు. కానీ ఆమె మాత్రం.. తమ విధులను నిర్వహించారు. దీంతో ఎన్నికలు రద్దు చేయాలంటూ వైసీపీ నేతలు ఇచ్చిన పిటిషన్ బుట్ట దాఖలు చేశారు సాహ్ని. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇప్పుడు నీలం సాహ్ని కూడా జగన్‌కు అత్యంత ఆప్తులే. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్‌లు జగన్‌ను ఏ మాత్రం లెక్క చేయడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్