ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. గత నెలలో మొదలైన బడ్జెట్ సమావేశాల్లో నిత్యం.. ఏదోక విషయం సంచలనంగా మారుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు అవుతుందని అందరూ భావించినా.. వైసీపీ మాత్రం దూరంగా ఉందనే చెప్పాలి. ఇటు శాసన మండలిలో కూడా వాతావరణం హాట్ టాపిక్ గా మారుతోంది. కల్తీ లడ్డు విషయంలో వైసీపీ నాయకత్వం అనుసరించిన వైఖరి కూటమి సర్కార్ కు కాస్త ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి.
Also Read : మరో దేశంపై ట్రంప్ గురి.. యుద్ధంపై సంచలన కామెంట్స్..!
ఇక కూటమి నేతలు కొన్ని విషయాలను సభలో ప్రస్తావించే విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు అనే మాట వాస్తవం. దీనిపై కూటమి పార్టీల కార్యకర్తలలో కూడా పలు సందర్భాల్లో చర్చలు జరిగాయి. తాజాగా దీనిపై ఏపీ అసెంబ్లీలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీకి హాజరైన పవన్.. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా.. 1,100 మంది ఉన్నట్లు మాట్లాడతారన్నారు. వాళ్లు చెప్పేది బలంగా నమ్ముతారు.. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేసారు.
కూటమి ప్రభుత్వంలో పార్టీలు వేరువేరు సమూహాల నుంచి వచ్చాయి.. మనం ఏకాభిప్రాయంతో ఉండాలని పవన్ ఆకాంక్షించారు. 15 ఏళ్లు రాష్ట్రం కోసం కలిసి పాటు పడదాం అని స్పష్టం చేసారు. వాళ్లే కల్తీ చేసి, మనం చేశామని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు తిట్టి, కులాల వెనుక దాక్కుంటున్నారని, ఇలాంటి ధోరణితో ప్రజలు నష్టపోతారు.. ప్రజలకు నిజానిజాలేంటో తెలియాలన్నారు పవన్ కళ్యాణ్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read : పెళ్లిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
సాధారణంగా ప్రచారం చేసుకునే విషయంలో వైసీపీ ముందు నుంచి దూకుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. వాళ్లకు అనుకూల, కూటమికి వ్యతిరేక ప్రచారం చేసే విషయంలో ఆ పార్టీ నేతలు వెనుకడుగు వేయరు. కానీ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు మాత్రం మీడియా ముందు కనపడటానికి కూడా సిగ్గుపడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలను కూడా ఎమ్మెల్యేలు సరిగా వినియోగించుకోలేదు అనే విమర్శలు ఉన్నాయి.

