Tuesday, November 3, 2026 10:35 AM
Tuesday, November 3, 2026 10:35 AM

లోకేష్ చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతం

కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం కోరితే నేనున్నానని భరోసానివ్వడం యువనేత నారా లోకేష్ నైజం. ఈ అరుదైన లక్షణమే ఆయనను కోట్లాదిమంది ప్రజల అభిమాన నేతగా మార్చింది. ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదంతం చివరకు మంత్రి లోకేష్ చొరవతో చివరకు సుఖాంతమైంది. తాజాగా అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందుల తాలూకూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్ అయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ వెనువెంటనే స్పందించి ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేసి, తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

శివ చేసిన వీడియోలో తాను ఎక్కడనుంచి మాట్లాడుతున్నది చెప్పకపోవడంతో అతడి అడ్రస్ ను గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టిడిపి విభాగం కొంత కష్టపడాల్సి వచ్చింది. లోకేష్ ఆదేశాలతో రెండురోజులపాటు గాలించిన గల్ఫ్ టిడిపి విభాగం నాయకులు… ఎట్టకేలకు శివ అడ్రస్ ను గుర్తించి అతడు తిరిగి స్వస్థలానికి చేరడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం కువైట్ నుంచి స్వస్థలమైన చింతపర్తికి చేరుకున్న శివ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి నారా లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని, తాను స్వగ్రామానికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన మరువలేనని కన్నీళ్ల పర్యంతమయ్యారు. శివ స్వస్థలానికి చేరడానికి సహకరించిన లోకేష్ కు ఆయన కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ… మంత్రి లోకేష్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.

కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి స్పందించి శివ కథను సుఖాంతం చేసిన మంత్రి లోకేష్ పై ప్రసారమాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లోకేష్ పనితీరు నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్నప్రజల కోసం ఎందాకైనా వెళ్లి ఆపన్నహస్తం అందించే మీ కమిట్మెంట్ కు హ్యాట్సాఫ్ అంటూ బాలాజీగుప్త అనే నెటిజన్ లోకేష్ ను అభినందించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మాటల యుద్ధానికి తెర.....

ఎన్నికల సమరం ముగిసింది.. ఇక రాజకీయ...

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

తెలంగాణాపై గురిపెట్టిన అమిత్...

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్...

ఐఏఎస్ అధికారుల చేతికి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై...

సాయిరెడ్డి కొత్త పార్టీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా...

30 ఏళ్ల తర్వాత...

కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం...

పోల్స్