Wednesday, August 5, 2026 04:57 AM
Wednesday, August 5, 2026 04:57 AM

మిస్టరీగానే నటి శోభిత ఆత్మహత్య…?

కన్నడ నటి శోభిత ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది ఇంకా తేలలేదు. శోభిత మృతికి భర్తతో విభేదాలా.. యాక్టింగ్‌కు దూరంగా ఉండటమా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, శోభిత అంత్యక్రియలు ఆమె స్వస్థలం బెంగళూరులో జరగనున్నాయి.

కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. శోభిత భర్త సుధీర్‌తో పాటు స్థానికుల స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేసిన పోలీసులు.. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం.. శోభిత డెడ్‌బాడీని కుటుంబసభ్యులకి అప్పగించారు. బెంగళూరులో అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read : దక్షిణ భారతంలో పార్లమెంట్ సమావేశాలు…!

కర్ణాటకు చెందిన శోభిత సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లోనూ నటించింది. ఏడాదిన్నర క్రితం మ్యాట్రీమోని ద్వారా హైదరాబాద్‌కు చెందిన సుధీర్ రెడ్డి పరిచమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ ఇష్టపడి పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన శోభిత.. యాక్టింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి తన గదిలోకి వెళ్లిన శోభిత.. ఉదయం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే, సుధీర్‌ రెడ్డి, శోభిత మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని.. సుధీర్‌ రెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు.

శోభిత మృతి కేసులో విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో ‘మీరు చావాలి అనుకుంటే యు కెన్ డు ఇట్’ అని రాసి ఉంది. సూసైడ్ నోటు ఆధారంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా… భర్తతో విభేదాలా… యాక్టింగ్‌కు దూరంగా ఉండటమా.. అనే దానిపై విచారణ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్