కొత్త పార్టీ ఏర్పాటుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృత్తి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కోర్టు కొట్టివేసింది. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : ఇక అంతా పబ్లిక్.. త్రిష, విజయ్ బోల్డ్ స్టెప్
ఎవరు ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం న్యాయానిదే అని.. కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని.. ఈ కేసు వల్ల తాను, తన కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించినట్లు తెలిపారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలన్న కవిత.. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను అని గతంలోనే ప్రకటించారు.
Also Read : మోడీ కేబినేట్ లో వింతలు ఇవే..!
తనపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేసిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని కవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుపతి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. పాదయాత్ర ప్రారంభానికి ముందు అలిపిరి మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, జాగృతి నాయకులతో కలిసి ఈ తెల్లవారుజామున స్వామి వారిని దర్శించుకున్నారు.
వేంకటేశ్వర స్వామి అంటే తమకు ఎంతో నమ్మకం అని తెలిపిన కవిత.. కాలి నడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందన్నారు. కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా కుటుంబంతో సహా మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. ఆంధ్రాలో కూడా తమ శ్రేయోభిలాషులు, తన మేలు కోరే వారు ఉన్నారన్నారు. త్వరలోనే తాను ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని కవిత వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవితకు టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.

