Saturday, September 19, 2026 06:45 AM
Saturday, September 19, 2026 06:45 AM

‘డబుల్ ఇస్మార్ట్’లో మరో హీరోయిన్ ?

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఇప్పుడు ఈ సాంగ్ ను అనన్య పాండేతో చేయిస్తున్నారని టాక్. పూరి దర్శకత్వంలో వచ్చిన లైగ‌ర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి, డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్