Wednesday, August 5, 2026 05:12 AM
Wednesday, August 5, 2026 05:12 AM

టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి…!

వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న లీడర్‌ ఆళ్ల నాని. ఏలూరుకు చెందిన ఆళ్ల నాని… వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్‌ వెంటే నడిచారు. 2004, 2009లో కాంగ్రెస్‌ తరఫున వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల నాని… జగన్‌ కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. 2010లో ఓదార్పు యాత్ర ప్రారంభం నాటి నుంచి జగన్‌తోనే ఆళ్ల నాని ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే… తొలి జాబితాలోనే ఆళ్ల నానికి మంత్రివర్గంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు జగన్. కరోనా విపత్తు సమయంలో ఆళ్ల నానిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి కూడా. అయితే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఆళ్ల నానిని తప్పించిన జగన్‌… అదే జిల్లాకు చెందిన తానేటి వనితను మాత్రం మంత్రిగా కొనసాగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆళ్ల నాని… నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

Also Read : రేషన్ బియ్యం తరలిస్తే ఇక అంతే సంగతులు.. ఏపి కొత్త చట్టం

ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ముందుగా పార్టీకి రాజీనామా చేసిన నేత ఆళ్ల నాని. పార్టీకి గుడ్‌ బై చెప్పిన ఆళ్ల నాని… ఇకపై రాజకీయాలకు సెలవు అంటూ వ్యాఖ్యానించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఆళ్ల నాని రాజీనామాతో ఏలూరులో వైసీపీకి కేడర్ లేకుండా పోయింది. అయితే ఆరు నెలల తర్వాత ఇప్పుడు రాజకీయంగా అడుగులు వేస్తున్నారు ఆళ్ల నాని. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఆళ్ల నాని రాకను ఒక వర్గం నేతలు ఆహ్వానిస్తుండగా… మరో వర్గం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీలో చేరే ముందు క్షమాపణలు చెప్పాలనేది ఒక వర్గం టీడీపీ నేతల వాదన. గతంలో తమపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని… గతంలో చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆళ్ల నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : ఇదెక్కడి ట్విస్ట్, బుకింగ్ యాప్స్ లో పుష్పకు షాక్ ఇస్తున్న అమరన్

మరోవైపు ఆళ్ల నాని చేరిక నేపథ్యంలో ఏలూరు టీడీపీ నేతలకు పార్టీ అధిష్టానం ఆహ్వానం పంపింది. ముఖ్యనేతలు ఉండవల్లి రావాలని ఫోన్లు చేసి చెప్పారు. ముందుగా పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారని తెలుస్తోంది. నేతల అభిప్రాయాల మేరకే పార్టీలో చేరికలుంటాయని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆళ్ల నాని చేరికపై చంద్రబాబు ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్