Wednesday, August 5, 2026 04:59 AM
Wednesday, August 5, 2026 04:59 AM

భారత్ పై మయన్మార్ భూకంప ప్రభావం

భూకంపం దెబ్బకు మయన్మార్ చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు మధ్య మయన్మార్‌లో ఆరు భూకంపాలు సంభవించాయి. వాటిలో ఒకటి 7.7 తీవ్రతతో నమోదు అయింది. సాగింగ్ నగరానికి వాయువ్యంగా, 10 నుండి 30 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. మయన్మార్‌లో ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Also Read : ‘పెద్ది’ లుక్ పై సోషల్ మీడియాలో రచ్చ

అయితే మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మండలే నగరంలోని ఒక మసీదు కూలిపోయిన ఘటనలో కూడా మరణాలు సంభవించాయని మీడియా తెలిపింది. భక్తులు లోపల ప్రార్థనలు చేస్తుండగా అది కూలిపోయిందని, ఓ కాలేజిలో భూకంప తీవ్రతకు మంటలు కూడా చెలరేగాయని మీడియా పేర్కొంది. మయన్మార్ రాజధాని నేపిడాలోని 1,000 పడకల ఆసుపత్రి.. సామూహిక ప్రాణనష్ట ప్రాంతంగా మారింది అంటూ అక్కడి అధికారులు చెప్తున్నారు.

Also Read : ఇంగ్లాండ్ తో సీరీస్ కు ముందు రోహిత్ సంచలనం

తీవ్రత దెబ్బకు మయన్మార్ సైనికాధికారులు భారీగా రంగంలోకి దిగారు. అత్యవసర పరిస్థితి ప్రకటించి అంతర్జాతీయ వ్యాప్తంగా సహాయం కోరుతున్నారు. ఉత్తర థాయిలాండ్ వరకు ప్రకంపనలు సంభవించాయి, దీనితో బ్యాంకాక్‌లో కొన్ని మెట్రో మరియు రైలు సేవలు నిలిపివేసారు. ఇక చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం భారత్ పై కూడా గట్టిగానే పడింది.

Also Read : రజనీకి మరిది తలనొప్పి.. మరో కేసు రెడీ

బెంగాల్‌లోని కోల్‌కతా, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌లోని ఢాకా, చట్టోగ్రామ్‌లలో కూడా తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని జాతీయ మీడియా వెల్లడించింది. బ్యాంకాక్‌లోని చతుచక్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ఆకాశహర్మ్యం కూలిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మయన్మార్‌లో, ఇరావడీ నదిపై ఉన్న ఒక పాత వంతెనతో పాటుగా పలు భవనాలు కూడా కూలిపోయాయి. భూకంపాలు మయన్మార్ కు కొత్తేమి కాదు. ఆ దేశ అభివృద్దిని ప్రకృతి ఎప్పుడు అడ్డుకుంటూనే ఉంది. 1930 మరియు 1956 మధ్య.. ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్న సాగింగ్ ఫాల్ట్ సమీపంలో 7.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్