Tuesday, September 22, 2026 04:09 PM
Tuesday, September 22, 2026 04:09 PM

క్రియాటిన్ తో పెరగనున్న బాడీ పవర్.. జిమ్‌ చేసి కష్టపడే వారికి గుడ్ న్యూస్..!

నేటి కాలంలో ఫిట్నెస్‌ పై ఆసక్తి పెరగడంతో చాలా మంది జిమ్‌ లలో గంటల తరబడి శ్రమిస్తున్నారు. అయితే, వ్యాయామం చేసే సమయంలో శక్తిని, సత్తువను పెంచుకోవడానికి క్రియాటిన్ అనే సప్లిమెంట్ ఎంతో సహాయపడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా చేసే వర్కౌట్ల కంటే క్రియాటిన్ వాడటం వల్ల పనితీరు 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రియేటిన్ ప్రధానంగా శరీరంలో అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తిని పెంచుతుంది.

Also Read : ఆపరేషన్ సుమతి.. టార్గెట్ రేవంత్..!

మనం బరువులు ఎత్తినప్పుడు లేదా వేగంగా పరుగెత్తినప్పుడు కండరాలకు కావలసిన ఇంధనాన్ని ఈ ఏటీపీ అందిస్తుంది. దీనివల్ల కండరాల పెరుగుదల వేగవంతం కావడమే కాకుండా, వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. బాడీ బిల్డింగ్ రంగంలో ఉన్న వారికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన సప్లిమెంట్‌ గా మారింది. ప్రయోజనాలతో పాటు క్రియాటిన్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఇది కండరాలలో నీటిని నిల్వ ఉంచుతుంది కాబట్టి, దీన్ని తీసుకునేటప్పుడు రోజంతా పుష్కలంగా నీరు తాగాలి.

Also Read : రోహిత్, కోహ్లీలతో కలిసి.. లక్నో స్టార్ ప్లేయర్ సంచలన కామెంట్స్..!

లేనిపక్షంలో డీహైడ్రేషన్ లేదా కండరాల తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ఇది కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సంబంధిత ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే దీన్ని ప్రారంభించే ముందు వైద్యుల లేదా ఫిట్నెస్ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. సరైన మోతాదులో, సరైన శిక్షణతో కలిపి క్రియాటిన్ ను తీసుకుంటే, ఫిట్నెస్ లక్ష్యాలను తక్కువ సమయంలోనే చేరుకోవచ్చని క్రీడా వైద్యులు సూచిస్తున్నారు. కేవలం సప్లిమెంట్లే కాకుండా పోషక విలువలున్న ఆహారం కూడా తోడైతేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వారు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

టీడీపీ కార్యకర్తలకు పవన్...

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

కళ్లెదుటే టీచర్లపై దాడి...

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో...

హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి...

వైసీపీ నేతలపై క్రిమినల్...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ...

పోల్స్