Saturday, September 19, 2026 10:18 AM
Saturday, September 19, 2026 10:18 AM

కేబినెట్ సమాచారం లీక్.. మంత్రులపై చంద్రబాబు డౌట్

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశం హాట్ హాట్ గా జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పలు కీలక అంశాలపై అధికారులు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వంలోని కీలక సమాచారం, కేబినెట్ అజెండా ముందే బయటకు రావడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్యాలు ఎలా లీక్ అవుతున్నాయి..? అని ఆయన మంత్రులను సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా గతంలో ఎన్టీఆర్ కేబినెట్ సమాచారం లీక్ అయిందన్న కారణంతో మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన నిర్ణయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

Also Read : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏపీ సర్కార్..!

ఇకపై సమాచార లీకేజీకి సంబంధిత మంత్రులే బాధ్యత వహించాలని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైయస్ జగన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు మంత్రులను అప్రమత్తం చేశారు. కరడుగట్టిన నేరస్తులతో రాజకీయం చేయడం ప్రమాదకరం అని పేర్కొంటూ, క్రిమినల్ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. ప్రత్యర్థుల బెదిరింపు రాజకీయాలకు భయపడొద్దని మంత్రులకు సూచించిన సీఎం. ప్రజలకు నిరంతరం వాస్తవాలు వివరిస్తూ వారిని చైతన్యపరచాలని ఆదేశించారు.

Also Read : పాకిస్థాన్‌ కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్..!

కుట్రలను ఎదుర్కోవడంలో మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న చంద్రబాబు.. అమరావతి విషయంలో జరిగే తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగంపై సీఎం తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవ చేయాల్సిన వ్యవస్థలు క్లిష్టంగా మారి ఇబ్బందులు సృష్టిస్తున్నాయని, వాటిని సరళీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ఓ ఓనర్ షిప్ లాగా భావించి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్