Sunday, June 21, 2026 02:14 AM
Sunday, June 21, 2026 02:14 AM

కూటమి ఎమ్మెల్యేలతో బాబు కీలక భేటీ

టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యేలతో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీఏ కూటమి పభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, చంద్రబాబు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చించనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ లో ఈ సమావేశం జరగనుంది. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల టిడిపి నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మినహా మిగిలిన మూడు పార్టీల ఎమ్మెల్యేలు అందరిని ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Read Also : ఎమ్మెల్యే జగన్ కి ఊహించని షాక్ ఇచ్చిన నారా లోకేష్

ఈ సమావేశం కంటే ముందుగానే ఈరోజు ఉదయం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగునుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అవుతారు. వందరోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు తయారుచేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని చంద్రబాబు ముందుగా భావించారు. అయితే అప్పటికి అవి సిద్ధమైతే ఇవ్వాలని, లేని పక్షంలో తర్వాత ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇక మిత్రపక్షలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జీలు, వైసిపి గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టిడిపి అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో చేయాల్సిన పనులు, తీసుకురావాల్సిన మార్పుల విషయంలో ఇంచార్జిలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా ప్రణాళిక రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్